Xiaomi 12 Lite: 108 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త 5జీ ఫోన్ - సూపర్ డిస్ప్లే కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే షావోమీ 12 లైట్.
షావోమీ 12 లైట్ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి షావోమీ గతంలోనే టీజ్ చేసింది.
షావోమీ 12 లైట్ ధర
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 399 డాలర్లుగా (సుమారు రూ.31,600) ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 449 డాలర్లుగానూ (సుమారు రూ.35,600), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 499 డాలర్లుగానూ (సుమారు రూ.39,600) నిర్ణయించారు. బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
షావోమీ 12 లైట్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
5జీ, బ్లూటూత్ వీ5.2, వైఫై 6, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ స్పెషల్ ఆడియో టెక్నాలజీ కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్ కాగా... 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.73 సెంటీమీటర్లు కాగా, బరువు 173 గ్రాములుగా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్మీ - ఎలా ఉందో చూశారా!