అన్వేషించండి

Vivo V40 Series: మోస్ట్ అవైటెడ్ వివో వీ40 సిరీస్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఇవే!

Vivo V40 Pro: వివో వీ40 సిరీస్‌ను కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో వివో వీ40, వివో వీ40 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలోనూ వెనకవైపు, ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు.

Vivo V40 Series Launched:  వివో వీ40, వీ40 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. కంపెనీ లేటెస్ట్ వీ సిరీస్‌లో వచ్చిన ఫోన్లు ఇవే కావడం విశేషం. వివో వీ30 సిరీస్‌కు అప్‌గ్రేడ్లు చేసి వివో వీ40 సిరీస్‌ను కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. వివో వీ40 ప్రో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. వివో వీ40లో మాత్రం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను అందించారు. వీటిలో జీస్ బ్రాండెడ్ కెమెరాలు ఉన్నాయి. వీటి బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

వివో వీ40 ధర (Vivo V40 Price in India)
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999గానూ, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999గానూ ఉంది. గాంగెస్ బ్లూ, లోటస్ పర్పుల్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 19వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

వివో వీ40 ప్రో ధర (Vivo V40 Pro Price in India)
వివో వీ40 ప్రోలో మూడు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.49,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. గాంగెస్ బ్లూ, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో వివో వీ40 ప్రోని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 13వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుందని కంపెనీ ప్రకటించింది.

వివో వీ40, వీ40 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్‌గా ఉంది. 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్‌పై వివో వీ40 ప్రో రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇక వివో వీ40 మాత్రం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3పై రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌నే ఇందులో కూడా అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... వివో వీ40 ప్రోలో జీస్ బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరాను అందించారు. ఆరా లైట్ ఫ్లాష్ కూడా ఇందులో ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్921 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. ఆటోఫోకస్, ఓఐఎస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, మరో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్816 టెలిఫొటో పొర్‌ట్రెయిట్ సెన్సార్‌ను అందించారు.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

వివో వీ40 స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాలను ఇందులో అందించారు. రెండు ఫోన్లలోనూ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.

5జీ, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, బైదు, గెలీలియో, గ్లోనాస్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా వీటిలో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఈ ఫోన్లను అన్‌లాక్ చేయవచ్చు. ఈ రెండు ఫోన్ల బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. వీటి బరువు 0.75 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget