అన్వేషించండి

Samsung Galaxy S22 Ultra Green: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్‌లో కొత్త వేరియంట్ - సూపర్ డిజైన్ కూడా - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా గ్రీన్ కలర్ వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ మనదేశంలో ఫిబ్రవరిలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్22, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. బర్గండీ, ఫాంటం బ్లాక్, ఫాంటం వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు గ్రీన్ కలర్ వేరియంట్ లాంచ్ అయింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా గ్రీన్ కలర్ వేరియంట్ ధర
గ్రీన్ కలర్ మోడల్ కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,09,999గా ఉంది. ప్రస్తుతానికి శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అయితే అమెజాన్‌లో ఇంకా సేల్‌కు రాలేదు. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.26,999 విలువైన గెలాక్సీ వాచ్ 4 వాచ్‌ను రూ.2,999కే కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్పెసిఫికేషన్లు
దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఫోన్ బాడీలోనే మొదటిసారి ఇన్‌బిల్ట్ ఎస్-పెన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపైనే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల ఎడ్జ్ క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను ఇందులో అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 512  జీబీ వరకు స్టోరేజ్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, మరో 10 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 40 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, యూడబ్ల్యూబీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు శాంసంగ్ ఇందులో అందించింది. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 229 గ్రాములుగా ఉంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget