అన్వేషించండి

Samsung Galaxy S22 Price Drop: శాంసంగ్ సూపర్ ఫోన్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్ - ఏకంగా రూ.20 వేలు!

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ సేల్‌లో భారీ ఆఫర్ అందించనున్నారు. ఈ సేల్‌లో దీని ధర రూ.52,999 నుంచి ప్రారంభం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో సూపర్ ఆఫర్ అందించనున్నారు. దీనిపై ఏకంగా రూ.20 వేల తగ్గింపు లభించనుంది. దీన్ని అమెజాన్ బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ది ఇయర్‌గా చెబుతోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్22లో అందించారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.72,999గా నిర్ణయించారు. దీన్ని రూ.52,999కు విక్రయించనున్నారు. అంటే రూ.20 వేలు తగ్గిందన్న మాట. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.76,999గా ఉంది. దీని ధర ఎంతనేది తెలియరాలేదు. గ్రీన్, ఫాంటం బ్లాక్, ఫాంటం వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఎస్22 పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌ను ఇందులో అందించారు. ఆర్మర్ అల్యూమినియం చాసిస్ కూడా ఇందులో ఉంది. ఇందులో అడాప్టివ్ 120 హెర్ట్జ్ ఫీచర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఈ మూడిట్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 

యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో శాంసంగ్ అందించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎస్22 పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 3700 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 168 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget