అన్వేషించండి

Redmi Note 11SE: నాలుగు కెమెరాలతో రెడ్‌మీ కొత్త ఫోన్ - రూ.14 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ చేసింది. అదే రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ.

రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్డ్ ఫోన్‌లో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.13,499గా నిర్ణయించారు. బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 31వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.

రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌‌ను ఈ ఫోన్ పనిచేయడానికి . 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

డ్యూయల్ స్పీకర్ సెటప్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 178.8 గ్రాములుగా ఉంది.

రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. చార్‌కోల్ బ్లాక్, స్లేట్ గ్రే, సీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 

ఇందులో 6.53 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ తరహా హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget