అన్వేషించండి

Realme Festive Days Sale: ఫెస్టివల్ డేస్‌లో రియల్‌మీ బంపర్ ఆఫర్ - రూ.16 వేల వరకు డిస్కౌంట్లు!

రియల్‌మీ ఫెస్టివ్ డేస్ ఆఫర్ సేల్‌ను త్వరలో నిర్వహించనుంది.

రియల్‌మీ ఫెస్టివ్ డేస్ ఆఫర్ సేల్‌ను కంపెనీ ప్రకటించింది. ఇందులో కంపెనీ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ ఆఫ్ ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపు అందించనున్నారు. వీటిపై ఏకంగా రూ.16 వేల వరకు తగ్గింపు లభించనుంది. ఇటీవలే లాంచ్ అయిన రియల్‌మీ జీటీ నియో 3టీ సేల్ కూడా ఆ సమయంలోనే జరగనుంది.

సెప్టెంబర్ 23వ తేదీ నుంచిఈ ఫెస్టివల్ సేల్ జరగనుంది. రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మొదటి సేల్‌లో రియల్‌మీ జీటీ నియో 3టీపై ఏకంగా రూ.7,000 వరకు తగ్గింపును అందించనున్నారు.

80W ఫాస్ట్ చార్జింగ్, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌లు ఉన్న అత్యంత చవకైన ఫోన్ ఇదేనని కంపెనీ గతంలోనే ప్రకటించింది. రియల్‌మీ జీటీ 2 ప్రోపై రూ.15 వేల వరకు తగ్గింపును అందించనున్నారు. అమెజాన్, రియల్‌మీ.కాంల్లో రియల్‌మీ నార్జో 50 5జీని రూ.11,999కే కొనుగోలు చేయవచ్చు. దీంతో దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే కానుంది.

రియల్‌మీ ల్యాప్‌టాప్‌లపై కూడా రూ.16 వేల వరకు తగ్గింపును అందించనున్నారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌తో పాటే రియల్‌మీ ఫెస్టివ్ డేస్ కూడా జరగనుందన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇదే టైమ్ పీరియడ్‌లో దాదాపు అన్ని బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై తగ్గింపు అందించనున్నారు.

రియల్‌మీ జీటీ నియో 3టీ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాంల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. డాష్ ఎల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ జీటీ నియో 3టీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్ కాగా, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఉంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ నియో 3టీ పని చేయనుంది. డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉన్న డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 194.5 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget