అన్వేషించండి

Realme C30: రూ.8 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - భారీ బ్యాటరీ కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త బడ్జెట్ ఫోన్ సీ30ని మనదేశంలో లాంచ్ చేయనుంది.

రియల్‌మీ మనదేశంలో తన బడ్జెట్ ఫోన్ సీ30ని లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను రియల్‌మీ తన సోషల్ మీడియా చానెళ్ల ద్వారా విడుదల చేసింది. జూన్ 20వ తేదీన మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది.

ఈ ఫోన్ ఇప్పటికే ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. ఇందులో ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా చూడవచ్చు. రియల్‌మీ సీ30 ప్రాసెసర్, బ్యాటరీ, బరువు, మందం వంటి కీలక అంశాలను కూడా కంపెనీ లాంచ్‌కు ముందే రివీల్ చేసింది. ఇక ధరను రివీల్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్. ఉంది దీని ఫీచర్లను బట్టి చూస్తే రియల్‌మీ సీ30 ధర రూ.8 వేలలోపే ఉండే అవకాశం ఉంది.

రియల్‌మీ సీ30 ఫీచర్లు
రియల్‌మీ సీ30 స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. రియల్‌మీ సీ30 మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 181 గ్రాములుగా ఉంది.

ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో ఒక వేరియంట్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో ఒక వేరియంట్ లాంచ్ కానుంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

దీనికి సంబంధించిన అధికారిక రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఫోన్ కిందివైపు అంచు బాగా మందంగా ఉంది. ఫోన్ వెనకవైపు ప్రత్యేకమైన డిజైన్ అందించారు. రియల్‌మీ బ్రాండింగ్, వెనకవైపు కెమెరాను కూడా చూడవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించలేదు.

స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ , మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. బ్లూ, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget