అన్వేషించండి

Realme 10 Pro Plus: రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్‌తో పోటీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే రియల్‌మీ 10 ప్రో ప్లస్.

రియల్‌మీ 10 సిరీస్‌లో టాప్ మోడల్ వేరియంట్ అయిన రియల్‌మీ 10 ప్రో ప్లస్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 6.7 అంగుళాల అమోఎల్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరాను రియల్‌మీ అందించింది. రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌తో రియల్‌మీ 10 ప్రో ప్లస్ పోటీ పడనుంది. అయితే రెడ్‌మీ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

రియల్‌మీ 10 ప్రో ప్లస్ ధర
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 యువాన్లుగా (సుమారు రూ.19,500) ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లు (సుమారు రూ.23,000) కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధరను 2,299 యువాన్లుగా (సుమారు రూ.26,500) నిర్ణయించారు. నైట్, ఓషన్, స్టార్‌లైట్ కలర్ ఆప్షన్లలో రియల్‌మీ 10 ప్రో ప్లస్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందని రియల్‌మీ ప్రకటించింది.

రియల్‌మీ 10 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.7 అంగుళాల 61 డిగ్రీ కర్వేచర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌పై రియల్‌మీ 10 ప్రో ప్లస్ పని చేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ 10 ప్రో ప్లస్ పని చేయనుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.77 సెంటీమీటర్లు కాగా, బరువు 173 గ్రాములుగా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by realme (@realmeglobal)

టాప్ హెడ్ లైన్స్

iPhone Price Hike: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు
యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
Phone Charging Tips: చాలా మంది తమ ఫోన్‌ను ఛార్జింగ్ నుంచి తీసేటప్పుడు ఈ పొరపాటు చేస్తారు! దీని వల్ల కలిగే ప్రమాదాలు తెలుసా? 
చాలా మంది తమ ఫోన్‌ను ఛార్జింగ్ నుంచి తీసేటప్పుడు ఈ పొరపాటు చేస్తారు! దీని వల్ల కలిగే ప్రమాదాలు తెలుసా? 

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
PUC Certificate: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బండికి ఇది లేకపోతే భారీ జరిమానా, మీ జీతంలో చాలాభాగం కోల్పోతారు!
Embed widget