Oppo Reno 8 Pro 5G: హోజ్ ఆఫ్ ది డ్రాగన్ థీమ్‌తో ఒప్పో కొత్త ఫోన్ - డ్రాగన్ గుడ్డు ఆకారంలో!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. అదే ఒప్పో రెనో 8 ప్రో 5జీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లిమిటెడ్ ఎడిషన్.
ఒప్పో రెనో 8 ప్రో 5జీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. ఒప్పో రెనో 8 ప్రో 5జీ ఇప్పటికే మనదేశంలో లాంచ్ అయింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ లెదర్ ఫినిష్‌తో రానుంది. డ్రాగన్ ఎగ్ షేప్‌లో ఉన్న సిమ్ ఎజెక్ట్ పిన్ ఇందులో ఉండనుంది.
దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఒప్పో రెనో 8 ప్రో 5జీ మనదేశంలో రూ.45,999 ధరతో లాంచ్ అయింది. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. గ్లేజ్డ్ బ్లాక్, గ్లేజ్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో రెనో 8 ప్రో 5జీ హోస్ ఆఫ్ ది డ్రాగన్ స్పెసిఫికేషన్లు
దీని ఫీచర్లు ఒప్పో రెనో 8 ప్రో 5జీ తరహాలోనే ఉండనున్నాయి. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ కూడా ఇందులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందుబాటులో ఉంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 80W సూపర్ ఫ్లాష్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు ఈ సామర్థ్యం నిలబడగలదని తెలుస్తోంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram