అన్వేషించండి

OnePlus Nord 2T India Launch: జులై 1న వన్‌ప్లస్ కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ నార్డ్ 2టీ 5జీ మనదేశంలో జులై 1వ తేదీన లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో గత నెలలోనే లాంచ్ అయింది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న లీకుల ప్రకారం ఈ ఫోన్ మనదేశంలో జులై 1వ తేదీన లాంచ్ కానుంది. దీని ధర కూడా ఆన్‌లైన్‌లో లీకయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.

వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ ధర (అంచనా)
ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ కానుందని సమాచారం. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999గానూ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రే షాడో, జేడ్ ఫాగ్ కలర్ ఆప్షన్లలో వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ కొనుగోలు చేయవచ్చు.

దీంతోపాటు వన్‌ప్లస్ కొన్ని బ్యాంకు కార్డులపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య ఈ ఫోన్ సేల్ జరిగే అవకాశం ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 2టీ గ్లోబల్ లాంచ్ కూడా ఈ రెండు వేరియంట్లలోనే అయింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 399 యూరోలుగానూ (సుమారు రూ.32,600), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 499 యూరోలుగానూ (సుమారు రూ.40,800) నిర్ణయించారు.

వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ 2టీ పనిచేయనుంది. 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఉండనుంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 80W సూపర్ వూక్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు. వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఇందులో అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 సెన్సార్ కూడా అందించారు.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget