అన్వేషించండి

Motorola Edge 30: మోటొరోలా 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ వచ్చేసింది - ప్రపంచంలో బెస్ట్ ఇదేనా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్ ఎడ్జ్ 30 అల్ట్రాను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఇందులో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 125W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. 

మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ధర
మోటొరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ ధరను 899 యూరోలుగా (సుమారు రూ.72,150) నిర్ణయించారు. ఇందులో కేవలం 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. ప్రస్తుతం అర్జెంటీనా, బ్రెజిల్, యూరోప్‌ల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది.

మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మై యూఎక్స్ స్కిన్‌పై మోటొరోలా ఎడ్జ్30 పనిచేయనుంది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఈ డిస్‌ప్లేలో ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా అందించారు.  ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు. ఫోన్ వెనకవైపు కర్వ్‌డ్ ప్యానెల్‌తో వస్తుంది. పంచ్ హోల్‌ను డిస్ ప్లే పైన మధ్య భాగంలో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు ఏకంగా 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. స్నాప్‌డ్రాగన్ ఎలైట్ గేమింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4610 ఎంఏహెచ్ కాగా, 125W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం ఏడు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్, 19 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్ ఎక్కనుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 198.5 గ్రాములుగా ఉంది.

మోటొరోలా ఇటీవలే తన మోటో జీ71 5జీ స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో తగ్గించింది. ఈ ఫోన్ ధరపై ఏకంగా రూ.3,000 తగ్గింపు అందించడం విశేషం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. మోటో జీ71 5జీలో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర లాంచ్ సమయంలో రూ.18,999గా నిర్ణయించారు. అయితే ఇప్పుడు దీన్ని రూ.15,999కు తగ్గించారు. ఆర్కిటిక్ బ్లూ, నెఫ్ట్యూన్ గ్రీన్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Fake Doctors: హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు.. 12 మంది ఫేక్ డాక్టర్ల గుట్టురట్టు
హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు.. 12 మంది ఫేక్ డాక్టర్ల గుట్టురట్టు
Embed widget