iQoo Neo 6 SE: ఐకూ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - మిడ్‌రేంజ్‌లోనే టాప్ క్లాస్ ప్రాసెసర్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఐకూ నియో 6 ఎస్ఈ.

FOLLOW US: 

ఐకూ నియో 6 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఐకూ నియో 6 సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్‌ను సెక్యూరిటీ కోసం అందించారు.

ఐకూ నియో 6 ఎస్ఈ ధర
ఇందులో మూడు వేరియంట్లను కంపెనీ లాంచ్ చేసింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,999 యువాన్లుగా (సుమారు రూ.23,000) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగానూ (సుమారు రూ.26,500), టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్  + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగానూ (సుమారు రూ.28,850) ఉంది. ఇంటర్‌స్టెల్లార్, ఆరెంజ్, నియో కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

ఐకూ నియో 6 ఎస్ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఓషన్ కస్టం స్కిన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఐకూ అందించింది. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఐకూ నియో 6 ఎస్ఈ బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 80W ఫ్లాష్ చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుండటం విశేషం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.854 సెంటీమీటర్లు కాగా... బరువు 190 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Published at : 08 May 2022 08:51 PM (IST) Tags: iQOO New Phone iQoo Neo 6 SE Price iQoo Neo 6 SE Features iQoo Neo 6 SE iQoo Neo 6 SE Specifications

సంబంధిత కథనాలు

Samsung Galaxy A23 5G: శాంసంగ్ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది - సూపర్ ఫీచర్లతో!

Samsung Galaxy A23 5G: శాంసంగ్ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది - సూపర్ ఫీచర్లతో!

Vivo Y72t: వివో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర బడ్జెట్‌లోనే!

Vivo Y72t: వివో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర బడ్జెట్‌లోనే!

Redmi Note 11SE: రూ.13 వేలలోపే రెడ్‌మీ కొత్త 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Redmi Note 11SE: రూ.13 వేలలోపే రెడ్‌మీ కొత్త 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Tecno Pova 3: రూ.13 వేలలోనే 7000 ఎంఏహెచ్, 11 జీబీ వరకు ర్యామ్ ఉన్న ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు కూడా!

Tecno Pova 3: రూ.13 వేలలోనే 7000 ఎంఏహెచ్, 11 జీబీ వరకు ర్యామ్ ఉన్న ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు కూడా!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!