అన్వేషించండి

iQoo 9T: ఐకూ 9టీ లాంచ్ త్వరలోనే - కేక పుట్టించే కెమెరాలు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ కొత్త ఫోన్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ఐకూ 9టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన అమెజాన్ టీజర్‌ను కూడా డివైస్‌లో చూడవచ్చు. ఇప్పుడు ఐకూ 10 సిరీస్‌లో ఏదో ఒక ఫోన్ ఐకూ 9టీగా లాంచ్ కానుందని తెలుస్తోంది. అది ఐకూ 10నా? లేకపోతే ఐకూ 10 ప్రోనా? అన్నది తెలియరాలేదు. ఐకూ 10 చైనాలో జులై 19వ తేదీన లాంచ్ కానుంది.

ఐకూ 9టీ ఫస్ట్‌లుక్‌ను కంపెనీ టీజ్ చేసింది. దీని డిజైన్ ఐకూ 10కి కొంచెం దగ్గరగా ఉంది. ఇందులో వెనకవైపు డ్యూయల్ టోన్ డిజైన్ కూడా చూడవచ్చు. దీంతోపాటు ఐకూ 9టీలో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. 20x జూమ్ సామర్థ్యం ఉన్న టెలిఫొటో సెన్సార్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించనున్నారు.

ఐకూ 9టీలో వీ1+ ఇమేజింగ్ చిప్ కూడా ఉండనుంది. ఇది మొదట వివో ఎక్స్80 సిరీస్‌లో అందించారు. ఈ డివైస్ గురించి ఎక్కువ సమాచారం కూడా అందుబాటులో లేదు. ఐకూ 10 ప్రో స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

లీకైన వివరాల ప్రకారం... ఇందులో 6.78 అంగుళాల 2కే రిజల్యూషన్ ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఎల్టీపీవో ప్యానెల్‌ కూడా ఈ ఫోన్‌లో ఉండనుంది. ఇన్ డిస్‌ప్లే అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌తో పాటు అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

8 జీబీ, 12 జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఈ ఫోన్‌లో అందించనున్నారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్1 సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్లు వెనకవైపు ఉండనున్నాయి.

వివో వీ1+ ఇమేజింగ్ చిప్ ఈ ఫోన్‌లో కంపెనీ అందించనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 200W వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ లేదా ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
iPhone Price Hike: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు
యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
Embed widget