అన్వేషించండి

Infinix Note 12 Pro Sale: 108 మెగాపిక్సెల్ కెమెరా, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ - రూ.17 వేలలోపే - సేల్ ప్రారంభం!

ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ నోట్ 12 ప్రో సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.

ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ జీ99 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందించారు. డీటీఎస్ సరౌండ్ సౌండ్ సిస్టం కూడా ఉంది.

ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. అల్ఫైన్ వైట్, టస్కనీ బ్లూ, వొల్కానిక్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ అందించనున్నారు.

ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ప్రో పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ 6 నానోమీటర్ మీడియాటెక్ డైమెన్సిటీ జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కూడా ఇందులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ సెన్సార్ ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్, క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా ఉంది.

256 జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, జీ సెన్సార్, గైరోస్కోప్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.

200 మెగాపిక్సెల్ కెమెరాతో ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రాలో మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. మిడ్ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ ఎంట్రీ ఇవ్వనుంది.

రెండు కలర్ ఆప్షన్లలో ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 6.7 అంగుళాల అమోఎల్ఈడీ లేదా కర్వ్‌డ్ డిస్‌ప్లే ఇందులో అందించనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. వీటిలో 200 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనుందని తెలుస్తోంది. దీంతోపాటు టెలిఫొటో సెన్సార్, మాక్రో సెన్సార్ ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్ కాగా, 180W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం నాలుగు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ తెలుపుతోంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget