అన్వేషించండి

Infinix Hot 30 5G: రూ.12 వేల లోపే 128 జీబీ స్టోరేజ్‌తో 5జీ ఫోన్ - ఇన్‌ఫీనిక్స్ ‘హాట్’ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ!

ఇన్‌ఫీనిక్స్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ధర రూ.12,499 నుంచి ప్రారంభం కానుంది.

Infinix Hot 30 5G: ఇన్‌ఫీనిక్స్ హాట్ 30 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఈ ఫోన్‌లో హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించారు. ఏకంగా 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చే వారం నుంచి ఈ ఫోన్ సేల్ జరగనుంది.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 30 5జీ ధర (Infinix Hot 30 5G Price in India)
ఈ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బేస్ వేరియంట్ ధర 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,499గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499గా ఉంది.

అరోరా బ్లాక్, నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జులై 18వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ అందించనున్నారు. అంటే రూ.12 వేలలోపే 128 జీబీ స్టోరేజ్ ఉన్న బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 30 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే కూడా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 580 నిట్స్‌గా ఉంది. సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్‌ను డిస్‌ప్లేలో అందించారు. 

మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ద్వారా ఇన్‌ఫీనిక్స్ హాట్ 30 5జీ రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్ కూడా ఉంది. దీన్ని మెమ్‌ఫ్యూజన్ ర్యామ్ ఫీచర్ ద్వారా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీంతోపాటు 128 జీబీ స్టోరేజ్ కూడా ఉంది. 1 టీబీ వరకు ఎస్‌డీ కార్డును ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. వెనకాల క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్, ముందువైపు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా కూడా ఉన్నాయి.

5జీ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్, వైఫై ఫీచర్ల ద్వారా కనెక్టివిటీ లభించనుంది. దీంతోపాటు యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, జీ-సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ53 రేటింగ్ అందుబాటులో ఉంది. డీటీఎస్ టెక్నాలజీ ఉన్న డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉన్నాయి.

దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఫోన్ పని చేస్తుంది. ఇన్‌ఫీనిక్స్ హాట్ 30 5జీ మందం 0.99 సెంటీమీటర్లు కాగా, బరువు 215 గ్రాములుగా ఉంది.

Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget