అన్వేషించండి

Infinix GT 10 Pro: లాంచ్ అయిన నెలలోనే రేటు పెంచేశారు - సూపర్ హిట్ అయిన ఇన్‌ఫీనిక్స్ ఫోన్!

ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో పెంచారు. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.19,999 కాగా... ప్రస్తుతం రూ.20,999కు పెరిగింది.

ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే మనదేశంలో తన ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో. దీని ధరను ఇప్పుడు మనదేశంలో పెంచారు. ఇది ఒక గేమింగ్ ఫోన్ కావడం విశేషం. ఇందులో వెనకవైపు ట్రాన్స్‌పరెంట్ ఎఫెక్ట్ అందించే బ్యాక్ ప్యానెల్‌ను కంపెనీ అందించింది. నథింగ్ తరహా మినీ ఎల్ఈడీ లైట్ స్ట్రిప్, రిఫ్లెక్టివ్ హార్డ్ వేర్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో చూడవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి.

ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో ధర ఎంత పెరిగింది?
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.19,999గా ఉంది. ఇప్పుడు దీన్ని రూ.1,000 వరకు పెంచారు. దీంతో ఈ ఫోన్ ధర రూ.20,999కు చేరుకుంది సైబర్ బ్లాక్, మిరేజ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఏమీ అందించలేదు.

ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో పని చేయనుంది. ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌తో పాటు రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు కూడా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 10 బిట్ అమోఎల్ఈడీ ఎల్టీపీఎస్ డిస్‌ప్లేను అందించారు. డిస్‌ప్లేకు సంబంధించి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. హోల్ పంచ్ కటౌట్‌ను ఈ ఫోన్‌లో చూడవచ్చు.

ఇన్‌ఫీనిక్స్ తీసుకొచ్చిన ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌పై రన్ కానుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ వరకు పెంచుకునే ఆప్షన్ కూడా ఉంది. ఫోన్ వెనకవైపు ఎల్ఈడీ ఇండికేటర్‌ను కూడా ఈ మొబైల్‌లో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

5జీ, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్, వైఫై ఫీచర్ల ద్వారా కనెక్టివిటీ లభించనుంది. లైట్ సెన్సార్, ఈ-కంపాస్, జీ-సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇన్‌ఫీనిక్స్ జీటీ 10 ప్రో సపోర్ట్ చేయనుంది. 

Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget