అన్వేషించండి

Asus Zenfone 9: యాపిల్ తరహాలో అసుస్ లేటెస్ట్ ఫోన్ - 16 జీబీ వరకు ర్యామ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే అసుస్ జెన్‌ఫోన్ 9.

అసుస్ జెన్‌ఫోన్ 9 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. యాపిల్ తరహా చిన్న సైజులో ఆకట్టుకునే డిజైన్‌తో అసుస్ జెన్‌ఫోన్ 9 లాంచ్ కావడం విశేషం. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఉన్నాయి.

అసుస్ జెన్‌ఫోన్ 9 ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధర 799 యూరోల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.64,800) నుంచి ప్రారంభం కానుంది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, సన్‌సెట్ రెడ్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్లలో అసుస్ జెన్‌ఫోన్ 9 కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది.

అసుస్ జెన్‌ఫోన్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120 హెర్ట్జ్ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1100 నిట్స్‌గా ఉంది. హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా అందించారు.

16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. అడ్రెనో 730 జీపీయూని కూడా ఈ ప్రాసెసర్‌కు ఇంటిగ్రేట్ చేశారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సిక్స్-యాక్సిస్ గింబల్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, నావిక్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్ కాగా, 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 18.5 గంటల వీడియో ప్లేబ్యాక్ టైంను, 8 గంటల గేమింగ్ టైంను ఇది అందించనుంది. డ్యూయల్ మైక్రో ఫోన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 169 గ్రాములుగా ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget