భారతదేశంలో iPhone 18 Pro మరియు iPhone 18 Pro Max విక్రయాలు నేటి నుంచి (సెప్టెంబర్ 18, 2026) ప్రారంభమయ్యాయి. ఐఫోన్ లవర్స్ పలు నగరాల్లో యాపిల్ సెంటర్ల వద్దకు భారీగా చేరుకుంటున్నారు.
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
iPhone 18 Pro Sales in India | భారత్‌లో యాపిల్ ఐఫోన్ 18 ప్రో, iphone Pro Max సేల్స్ ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్ కొనుగోలు చేయడానికి అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్లకు చేరుకుంటున్నారు.

- భారత్‌లో ఐఫోన్ 18 ప్రో విక్రయాలు ప్రారంభం, భారీ రద్దీ.
- ప్రో మోడల్ ₹1,64,900, ప్రో మ్యాక్స్ ₹1,79,900 నుండి లభ్యం.
- బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్, ఆరు నెలల EMI ఎంపికలున్నాయి.
iPhone 18 కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ టైం రానే వచ్చింది. భారత్‌లో నేటి నుంచి Apple కొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. దాంతో ఐఫోన్ లవర్స్ దేశంలో పలు నగరాల్లో అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్స్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. iPhone 18 Pro ప్రారంభ ధర 1,64,900 రూపాయలుగా ఉంది. కొత్త iPhone కొనుగోలు చేస్తూ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్, No Cost EMI వంటి ఆప్షన్లతో కొంత మొత్తం ఆదా చేసుకోవచ్చు. మీరు కొత్త iPhone కొనాలని ప్లాన్ చేస్తుంటే, కొనడానికి ముందు ధరలు, ఆఫర్ల గురించి తెలుసుకోవాలి. మరి iPhone 18 Pro అత్యంత చౌక డీల్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుందాం.
ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, నోయిడా సహా పలు ముఖ్య నగరాల్లో యాపిల్ సెంటర్ల వద్దకు ఐఫోన్ లవర్స్ తరలి వస్తున్నారు. కొత్త ఐఫోన్ మోడల్ సొంతం చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాము ప్రతి కొత్త ఐఫోన్ మోడల్ కొనుగోలు చేస్తామని.. ప్రస్తుతం తమ వద్ద ఐఫోన్ 17 మోడల్ ఉందని కస్టమర్లు చెబుతున్నారు. కొందరు అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్దకు చేరుకోగా, కొందరు ఉదయం 4 గంటల నుంచే స్టోర్ల వద్దకు వస్తున్నారు.
#WATCH | Bengaluru: People queue up as the official sale of the iPhone 18 Pro and iPhone 18 Pro Max begins today in India.
— ANI (@ANI) September 18, 2026
Eager customers have lined up in long queues outside the Imagine Apple premium reseller store at the Mall of Asia to get their hands on the latest… pic.twitter.com/g9wsxeH61s
iPhone 18 Pro ధర ఎంత?
iPhone 18 Pro ప్రారంభ ధర 1,64,900. ఇందులో 256GB స్టోరేజ్ ఉన్న మోడల్ లభిస్తుంది. 512GB వేరియంట్ ధర అయితే రూ. 1,89,900. 1TB స్టోరేజీ మోడల్ ధర ఏకంగా 2,39,900 రూపాయలు, 2TB వేరియంట్ ధర 3,14,900 రూపాయలుగా నిర్ణయించారు.
అదే సమయంలో, iPhone 18 Pro Max 256GB మోడల్ ధర రూ. 1,79,900 గా ఉంది. కాగా 512GB వేరియంట్ 2,04,900. 1TB మోడల్ 2,54,900 రూపాయలు కాగా, 2TB వేరియంట్ 3,29,900 రూపాయలుగా ఫిక్స్ చేసింది యాపిల్ కంపెనీ.
#WATCH | Mumbai: Massive crowds gather outside the Apple Store in Mumbai as eager customers queue up ahead of the official sales launch of the iPhone 18 Pro and iPhone 18 Pro Max in India. pic.twitter.com/vOGotGmyFE
— ANI (@ANI) September 18, 2026
iPhone 18 Pro అత్యంత చౌక డీల్
iPhone 18 Pro సిరీస్ కొనుగోలులో బ్యాంక్ కార్డులపై 7,000 రూపాయల వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ రావొచ్చు. Apple వెబ్సైట్లో American Express, Axis Bank సహా ICICI Bank అర్హత కలిగిన కార్డులపై ఈ ఆఫర్ అందిస్తున్నారు. Flipkart, Amazon, Reliance Digital, Vijay Sales, Croma వంటి ప్లాట్‌ఫారమ్‌లపై కార్డ్ ఆఫర్లు వేరుగా ఉండనున్నాయి.
పాత ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్
మీ వద్ద పాత ఐఫోన్ ఉంటే Apple Trade In ద్వారా కొత్త iPhone ధరను తగ్గించుకోవచ్చు. పాత ఫోన్ మోడల్, దాని కండిషన్‌ను బట్టి ఎక్స్చేంజ్ క్రెడిట్ డిసైట్ చేస్తారు. రిపోర్టుల ప్రకారం, ఎక్స్చేంజ్పై 4,500 నుంచి 81,500 రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు.
6 నెలల No Cost EMI ఆప్షన్
మీరు ఒకేసారి మొత్తం చెల్లించలేకపోతే iPhone 18 Proను 6 నెలల No Cost EMIపై కూడా కొనవచ్చు. iPhone 18 Pro 256GB కోసం EMI నెలకు సుమారు రూ. 26,316 నుంచి ప్రారంభమవుతుంది. iPhone 18 Pro Max అయితే నెలవారీ ఈఎంఐ దాదాపు రూ. 28,817 ఉంటుంది..
iPhone 18 Proలో స్పెషాలిటీ ఏంటీ
iPhone 18 Proలో 6.3 అంగుళాలు, Pro Max మోడల్లో 6.9 అంగుళాల LTPO OLED Super Retina XDR డిస్ప్లే వస్తుంది. రెండింటిలోనూ 120Hz ProMotion, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఫోన్లో 2nm ఆధారిత A20 Pro చిప్సెట్, iOS 27.. 48MP మెయిన్, 48MP టెలిఫోటో, 48MP అల్ట్రా-వైడ్ కెమెరా ఇచ్చారు. దీంతో పాటు LiDAR స్కానర్, 18MP Center Stage ఫ్రంట్ కెమెరా లభిస్తుంది.
Frequently Asked Questions
భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో విక్రయాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
iPhone 18 Pro ప్రారంభ ధర ఎంత?
iPhone 18 Pro ప్రారంభ ధర 256GB మోడల్‌కు ₹1,64,900. iPhone 18 Pro Max 256GB మోడల్ ధర ₹1,79,900.
iPhone 18 Pro కొనుగోలుపై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి?
iPhone 18 Pro కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్‌పై ఎక్స్ఛేంజ్, మరియు 6 నెలల No Cost EMI వంటి ఆప్షన్లు ఉన్నాయి. అర్హత కలిగిన కార్డులపై ₹7,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
iPhone 18 Pro యొక్క ప్రధాన ప్రత్యేకతలు ఏమిటి?
iPhone 18 Proలో 6.3 అంగుళాల LTPO OLED Super Retina XDR డిస్ప్లే, 2nm ఆధారిత A20 Pro చిప్సెట్, మరియు 48MP మెయిన్ కెమెరా ఉన్నాయి. దీనికి 120Hz ProMotion మరియు 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























