అన్వేషించండి

Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!

Apple iPhone 17 Pro Offer: యాపిల్ కొత్త ఐఫోన్ 18 ప్రో భారీగా ఖర్చు చేయక్కర్లేకుండానే ప్రో సిరీస్ ఫోన్‌ను తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 17 ప్రో పై క్రోమా స్టోర్ బెస్ట్ ఆఫర్ తెచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త ఐఫోన్ 18 విడుదలైనా, క్రోమా 17 ప్రోపై ఆఫరిచ్చింది.
  • పాత ఫోన్ మార్పిడితో ఐఫోన్ 17 ప్రో ₹69,990కే లభిస్తుంది.
  • ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంకు క్యాష్‌బ్యాక్ వంటివి అదనపు లాభాలు.
  • తుది ధర పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువపై ఆధారపడుతుంది.

Apple iPhone 17 Pro Offer: యాపిల్ నుంచి ఇటీవల కొత్త సిరీస్ ఐఫోన్ 18 ప్రో విడుదలైంది. కొత్త ఫోన్ లాంచ్‌తో పాత మోడల్ ధరలు తగ్గుతాయని కస్టమర్లు ఆశగా ఎదురుచూశారు. సాధారణంగా, కొత్త ఐఫోన్ వచ్చిన తర్వాత పాత మోడళ్ల ధరలు తగ్గుతుంటాయి. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ ధరలు తగ్గించలేదు. అయితే రిటైలర్ క్రోమా.. ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్ 17 ప్రో ధరను రూ.69,990కి తగ్గించింది. అంటే, మీ దగ్గర పాత ఫోన్ ఉన్నట్లయితే, ఈ డీల్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

పాత మోడల్‌తో పోలిస్తే  

కొత్త ఐఫోన్ సిరీస్ విడుదలైన తర్వాత, కస్టమర్లు తరచుగా పాత మోడల్ ధర తగ్గే వరకు వేచి చూస్తారు. ఐఫోన్ 17 ప్రో విషయంలో క్రోమా ఆ ఛాన్స్ ఇచ్చింది. ఐఫోన్ 17 ప్రో 256GB మోడల్‌ను క్రోమా వివిధ ఆఫర్లతో తక్కువ ధరకు అందిస్తోంది. అంటే, యాపిల్ ప్రో మోడల్ కావాలనుకునే వాళ్లు, ఐఫోన్ 18 ప్రో(రూ.1.65 లక్షలు) వద్దనుకునేవాళ్లకి, పాత సిరీస్ ఫోన్ ఒక బెటర్ ఆప్షన్ కావచ్చు. 

Also Read: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు

ఐఫోన్ 17 ప్రో రూ. 69,990 ధరకే  

క్రోమా డీల్ ప్రకారం ఐఫోన్ 17 ప్రో 256 GB రూ.69,990లకే లభిస్తుంది. అయితే మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పాత ఐఫోన్ మోడళ్లకు రూ.44,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. దీనికి అదనంగా, మీరు రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, కొన్ని కార్డులపై రూ.4,000 వరకు బ్యాంకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ ప్రయోజనాలన్నీ కలిపితే ఐఫోన్ 17 ప్రో ధర భారీగా తగ్గుతుంది. అయితే, మీ పాత ఫోన్ మోడల్, పరిస్థితి, ఎక్స్ఛేంజ్ వ్యాల్యూను బట్టి ఫైనల్ ప్రైస్ మారవచ్చు.

Also Read: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్

ఐఫోన్ 17 ప్రో 

ఐఫోన్ లేటెస్ట్ మోడల్ మీ ఆప్షన్ కాకపోతే.. ఐఫోన్ 17 ప్రో ఇప్పటికీ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇది ప్రో సిరీస్ ప్రీమియం హార్డ్‌వేర్, కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అందువల్ల, యాపిల్ ప్రో ఫోన్ కావాలనుకునేవారు కొత్త మోడల్‌పై భారీగా ఖర్చు చేయనక్కర్లేకుండా కాస్త తక్కువ ధరకే బెటర్ ఫోన్‌ను పొందవచ్చు. సరికొత్త చిప్‌సెట్, కెమెరా బెటర్‌మెంట్, కొత్త ఫీచర్ల కోసం చూస్తుంటే ఐఫోన్ 18 ప్రో బెటర్ ఆప్షన్ కావచ్చు. యాపిల్ ఐఫోన్ 18 ప్రోలో A20 ప్రో చిప్, కొత్త వేపర్ ఛాంబర్ ఉన్నాయి.

ఐఫోన్ 17 ప్రో పై డీల్ తీసుకునే ముందు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూను చెక్ చేయండి. ఆ తర్వాత, మీ కార్డుపై బ్యాంకు క్యాష్‌బ్యాక్ వర్తిస్తుందో లేదో, ఎక్స్ఛేంజ్ బోనస్ రూల్స్ తనిఖీ చేయండి. ఈ ప్రయోజనాలన్నీ ఉంటే ధర మీ బడ్జెట్‌లో ఉంటేనే ఇది మంచి ఎంపిక అవుతుంది. మీ దగ్గర ఎక్స్‌ఛేంజ్‌కు ఐఫోన్ లేకపోతే, రూ.69,990 ఆఫర్ వర్తించదు.  

Also Read: చాలా మంది తమ ఫోన్‌ను ఛార్జింగ్ నుంచి తీసేటప్పుడు ఈ పొరపాటు చేస్తారు! దీని వల్ల కలిగే ప్రమాదాలు తెలుసా?

Frequently Asked Questions

ఐఫోన్ 17 ప్రోపై క్రోమా అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ ఏమిటి?

క్రోమా ఐఫోన్ 17 ప్రో 256GB మోడల్‌ను రూ.69,990కి తగ్గిస్తుంది. మీ వద్ద పాత ఫోన్ ఉండి ఎక్స్ఛేంజ్ చేస్తే ఈ ధర వర్తిస్తుంది.

ఐఫోన్ 17 ప్రోని రూ.69,990 ధరకే ఎలా పొందవచ్చు?

మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ ధర పొందవచ్చు. కొన్ని పాత ఐఫోన్ మోడళ్లకు రూ.44,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది.

ఐఫోన్ 17 ప్రో డీల్‌తో అదనపు ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?

అవును, ఈ డీల్‌తో రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, అలాగే కొన్ని బ్యాంక్ కార్డులపై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఐఫోన్ 18 ప్రో విడుదలైన తర్వాత కూడా ఐఫోన్ 17 ప్రో కొనుగోలు మంచి ఎంపికేనా?

యాపిల్ ప్రో మోడల్ కావాలనుకునేవారు, ఐఫోన్ 18 ప్రో (రూ.1.65 లక్షలు) అధిక ధర అనుకునేవారికి ఇది మంచి ఎంపిక. ఇందులో ప్రీమియం హార్డ్‌వేర్, కెమెరా సెటప్ ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Embed widget