అన్వేషించండి

Jio New Phone: యూపీఐ, వాట్సాప్‌ ఉన్న ఫోన్ రూ.999కే - మరో చెక్‌మేట్‌తో రానున్న జియో!

Jio New 4G Phone: జియో రూ.999కే యూపీఐ, వాట్సాప్, లైవ్ స్ట్రీమింగ్ ఉన్న ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

Jio New Phone: రిలయన్స్ జియో మనదేశంలో జియో భారత్ ఫీచర్ ఫోన్లతో కూడా 4జీ కనెక్టివిటీ, యూపీఐ సపోర్ట్, యాప్స్ సపోర్ట్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియో భారత్ సిరీస్‌లో జియో భారత్ వీ2, జియో భారత్ కే1 కార్బన్, జియో కార్బన్ బీ1 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఐటెల్, లావా, నోకియా కంపెనీలతో కూడా జియో భారత్ 4జీ హ్యాండ్ సెట్ల కోసం జియో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఉన్న 25 కోట్ల 2జీ వినియోగదారులను 4జీకి మార్చాలన్నది జియో లక్ష్యంగా తెలుస్తోంది.

ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం... ఐటెల్, లావా, నోకియా కంపెనీలతో రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ జియో ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నాయని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ తెలిపారు. యూపీఐ పేమెంట్స్, వాట్సాప్, లైవ్ స్ట్రీమింగ్ సపోర్ట్ ఉన్న 4జీ ఫీచర్ ఫోన్‌ను రూ.999కే లాంచ్ చేయడానికి జియో ప్రయత్నాలు చేస్తుంది.

ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న జియో భారత్ వీ2 ధర రూ.999గా ఉంది. జియో భారత్ కే1 కార్బన్‌ను కూడా రూ.999కే కొనుగోలు చేయవచ్చు. జియో భారత్ బీ1 ఫోన్‌ ధరను రూ.1,299గా నిర్ణయించారు. యూపీఐ, జియో యాప్స్ సపోర్ట్‌తో ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

జియో భారత్ వీ2 4జీ స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయి?
ఈ ఫోన్‌లో 1.77 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. జియో సినిమా, జియో సావన్, జియో పే సర్వీసులను జియో భారత్ వీ2 4జీ ద్వారా ఉపయోగించవచ్చు. దీని వెనకవైపు 0.3 మెగాపిక్సెల్ వీజీఏ కెమెరా అందుబాటులో ఉంది. 1000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ఫీచర్ ఫోన్ అందించనుంది. దీని స్టోరేజ్ చాలా మినిమల్‌గా ఉంటుంది. కానీ మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 ఎంబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు కార్బన్ లోగోను వేశారు.

జియో భారత్ వీ2 4జీ ప్లాన్లు
జియో భారత్ వీ2 4జీ ప్లాన్లను కూడా కంపెనీ ప్రకటించింది. రూ.123 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 500 ఎంబీ మొబైల్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను కంపెనీ అందించనుంది. ఇదే లాభాలతో వార్షిక ప్లాన్ కావాలనుకుంటే రూ.1,234తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

మరోవైపు రిలయన్స్ జియో మోస్ట్ అవైటెడ్ 5జీ స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్ 5జీకి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. జియో ఫోన్ 5జీ ఇమేజ్ ఇటీవలే ఇంటర్నెట్‌లో లీక్ అయింది. ఈ సంవత్సరం దీపావళికి ఈ ఫోన్‌ను విడుదల చేయవచ్చని కూడా గతంలో వార్తలు వచ్చాయి. మరి ఇది నిజం అవుతుందో కాదో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే. లీకైన ఫోటోలో ఫోన్ వెనుక ప్యానెల్, ముందువైపు డిజైన్‌ను క్లియర్‌గా చూడవచ్చు. ఇంతకు ముందు కూడా ఈ ఫోన్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయింది.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

టాప్ హెడ్ లైన్స్

Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget