News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Threads: థ్రెడ్స్ యాప్ సేఫేనా? - యూరోప్‌లో ఇంకా ఎందుకు లాంచ్ కాలేదు? - మీ ఫోన్‌లో 14 రకాల డేటా మెటా చేతిలో!

థ్రెడ్స్ మీ ఫోన్‌లో ఎంత డేటా కలెక్ట్ చేస్తుందో తెలుసా?

FOLLOW US: 
Share:

మెటా కొత్త యాప్ థ్రెడ్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇది ట్విట్టర్‌కు డైరెక్ట్ కాంపిటీషన్‌గా నిలిచింది. మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో థ్రెడ్స్‌లో లాగిన్ చేయవచ్చు. అయితే ప్రైవసీ పరంగా థ్రెడ్స్ యాప్ సేఫేనా? థ్రెడ్స్ మన డేటాను ఎంత మేరకు కలెక్ట్ చేస్తుంది? వీటి గురించి కూడా డిస్కషన్ ప్రారంభం అయింది.

2020లో యాపిల్ కొత్త పాలసీని తీసుకువచ్చింది. మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసే యాప్స్ ఎంత సమాచారాన్ని కలెక్ట్ చేస్తాయో లిస్ట్ చేసి వినియోగదారులకు చూపిస్తారు. యాప్ స్టోర్‌లో దీనికి సంధించిన అధికారిక లిస్టింగ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. థ్రెడ్స్ మనకు సంబంధించి ఎంత డేటాను కలెక్ట్ చేస్తుందో ఈ లిస్ట్‌లో చూడండి.

థ్రెడ్స్ కలెక్ట్ చేసే డేటా ఇదే
1. హెల్త్, ఫిట్‌నెస్
2. ఆర్థిక పరమైన సమాచారం
3. మన ఫోన్‌లోని కంటెంట్ (ఫొటోలు, వీడియోలు, ఫోన్‌లోని ఫైల్స్)
4. బ్రౌజింగ్ హిస్టరీ
5. మనం ఫోన్‌లో ఏమేం ఉపయోగిస్తున్నామనే డేటా
6. యాపిల్ డయాగ్నోస్టిక్స్
7. మనం చేసే కొనుగోళ్లు
8. లొకేషన్
9. కాంటాక్ట్స్
10. ఐఫోన్ ఐడెంటిఫయర్స్
11. మనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం
14. ఇతర సమాచారం (Other Data)

నిజానికి ట్విట్టర్ కూడా మన ఫోన్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. కానీ థ్రెడ్స్ స్థాయిలో ఎప్పుడూ కలెక్ట్ చేయలేదు. వినియోగదారుల హెల్త్, ఫిట్‌నెస్ డేటాను కూడా థ్రెడ్స్ కలెక్ట్ చేయడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం.

యూరోప్‌లో నో ఎంట్రీ?
అమెరికా డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం ఇది నడిచిపోతుందేమో కానీ, యూరోప్‌లో మాత్రం మెటా పప్పులు ఉడకవు. ఈ కారణంగానే యూరోప్‌లో థ్రెడ్స్ ఇంకా అందుబాటులోకి రాలేదు. యూరోపియన్ యూనియన్‌లో యూకేకు సభ్యత్వం లేదు. కాబట్టి యూకేలో మాత్రం థ్రెడ్స్‌ను వాడవచ్చు.

థ్రెడ్స్ చేస్తున్న ఈ భారీ డేటా కలెక్షన్ వినియోగదారులను భయపెట్టేదే. ఎందుకంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల కంటే ఎక్కువ డేటాను థ్రెడ్స్ కలెక్ట్ చేస్తుంది. ఈ డేటా ఆన్‌లైన్‌లో లీకైతే వచ్చే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు.

ఇప్పటికే చాలా సార్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డేటా బ్రీచ్‌లు మనం చూశాం. కానీ థ్రెడ్స్ డేటా బ్రీచ్ అయితే అంతకంటే ప్రమాదకరం ఉండదు. ఎందుకంటే దాదాపు మన ఫోన్‌లో ఉండే డేటా మొత్తాన్ని దాదాపుగా థ్రెడ్స్ కలెక్ట్ చేస్తుంది. కాబట్టి థ్రెడ్స్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు, దానికి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 08 Jul 2023 09:53 PM (IST) Tags: Threads Threads Data Collection Threads Privacy Threads Safety

ఇవి కూడా చూడండి

Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!

Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!

Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!

ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?

ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది