అన్వేషించండి

iQoo Neo 9 Pro: ఫిబ్రవరిలో ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ - ధర ఎంత ఉండవచ్చంటే?

iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. అదే ఐకూ నియో 9 ప్రో.

iQoo Neo 9 Pro Expected Price: ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన మీడియా ఇన్వైట్లు కూడా వెళ్లాయి. అమెజాన్‌లో దీనికి సంబంధించిన సేల్ కూడా ప్రారంభం కానుంది. ఐకూ నియో 9 ప్రో ఇండియన్ వేరియంట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఈ ఫోన్ డిసెంబర్‌లోనే చైనాలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై ఐకూ నియో 9 ప్రో చైనీస్ వేరియంట్ రన్ కానుంది.

ఫిబ్రవరి 22వ తేదీన ఐకూ నియో 9 ప్రో మనదేశంలో లాంచ్ కానుంది. దీన్ని కంపెనీ తన అధికారిక ఎక్స్/ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా ఐకూ షేర్ చేసింది. డ్యూయల్ టోన్ రెడ్ అండ్ వైట్ డిజైన్‌లో ఐకూ నియో 9 ప్రో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. వెనకవైపు రెండు కెమెరాలు కూడా చూడవచ్చు.

దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వెబ్ పేజీ కూడా అమెజాన్‌లో క్రియేట్ అయింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉండనుంది. ఇది చైనీస్ వేరియంట్ కంటే కాస్త డిఫరెంట్ ప్రాసెసర్‌తో రానుంది.

ఐకూ నియో 9 ప్రో చైనాలో డిసెంబర్‌లో లాంచ్ అయింది. చైనాలో ఈ ఫోన్ ధర 2,999 యువాన్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.35,000) నుంచి ప్రారంభం కానుంది. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. మనదేశంలో ఈ ఫోన్ రూ.40 వేల రేంజ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఉండటం విశేషం. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందించనున్నారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ కాగా, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ముందువైపు అందించారు.

మరోవైపు రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ 2022 అక్టోబర్‌లో జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తొమ్మిది కోట్ల మందికి పైగా 5జీ కస్టమర్లు ఇందులో చేరారు. రిలయన్స్ జియో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ సర్వీస్ రోల్‌అవుట్‌ని సాధించిందని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించిన త్రైమాసిక ఫలితాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget