iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్‌లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?
యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో సన్నని బెజెల్ బ్లాక్ ఎడ్జ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
iPhone 15 Pro Max: ఐఫోన్ 15 సిరీస్‌లో నాలుగు ఫోన్లు ఉండనున్నాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో కొత్త కెమెరా హార్డ్ వేర్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, డిజైన్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి.
ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో అత్యంత సన్నని ‘బెజెల్ బ్లాక్ ఎడ్జ్’ ఉండనుంది. దీని బెజెల్స్ కేవలం 1.55 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటాయన్న మాట. షావోమీ 13, శాంసంగ్ గెలాక్సీ ఎస్23, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మొబైల్స్ కంటే ఇది సన్నగా ఉండనుంది. యాపిల్ ఏ17 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేసే అవకాశం ఉంది.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో సన్నని అంచులు ఉండనున్నాయి. ఇంటర్నెట్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బ్లాక్ బెజెల్ వెడల్పు 1.55 మిల్లీమీటర్లుగా ఉండనుంది. షావోమీ 13 బ్లాక్ బెజెల్ వెడల్పు 1.81 మిల్లీమీటర్లుగానూ, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 బ్లాక్ బెజెల్ వెడల్పు 1.95 మిల్లీమీటర్లుగానూ, ఐఫోన్ 14 ప్రో బ్లాక్ బెజెల్ వెడల్పు 2.17 మిల్లీమీటర్లుగానూ ఉంది.
కాబట్టి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ప్రో మోడల్స్ కంటే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ కొంచెం లావుగా ఉండవచ్చు. కొత్త ఐఫోన్ జనరేషన్ మొబైల్స్ సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వీటి ధర కూడా ముందు జనరేషన్ మోడల్స్ కంటే తక్కువగా ఉండనుంది. హార్డ్ వేర్ అప్‌గ్రేడ్స్, టైటానియం ఫ్రేమ్స్, సాలిడ్ స్టేట్ బటన్స్, మరింత ర్యామ్ కూడా ఇందులో అందించనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లలో కెమెరా బంప్‌ను రీడిజైన్ చేశారు. ఇందులో 48 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌పై ఇవి పని చేయనున్నాయి. ప్రో మోడల్స్‌లో మాత్రం ఏ17 బయోనిక్ చిప్‌ను అందించనున్నారు. యాపిల్ లైట్‌నింగ్ పోర్టు బదులుగా యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఇందులో అందించనున్నారు.
యాపిల్ తన ఐఫోన్లలో వాడే హార్డ్ వేర్ గురించి ఎక్కువ వివరాలను బయటకు వెల్లడించింది. కానీ ఇప్పుడు యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ కెమెరా గురించి కీలక వివరాలు వెల్లడించారు. ఐఫోన్లలో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి సోనీ కెమెరాలు వాడుతున్నట్లు తెలిపారు. ఐఫోన్ కెమెరా రిజల్యూషన్, జనరిక్ ఇన్ఫర్మేషన్ గురించి తప్ప మిగతా వివరాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
‘దాదాపుగా ఒక సంవత్సరం నుంచి సోనీతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ కెమెరాలు అందించడానికి అదే కారణం.’ అని టిమ్ కుక్ ట్వీట్ చేశారు. సోనీ సీఈవో కెనిచిరో యోషిదాతో కలిసి దిగిన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం కేవలం ప్రో మోడల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ త్వరలో అన్ని ఐఫోన్ మోడళ్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.