(Source: ECI/ABP News/ABP Majha)
iPhone 15 Offer: ఐఫోన్ 15పై భారీ తగ్గింపు - ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్లు!
iPhone 15 Flipkart Offer: ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో భారీ ఆఫర్ అందించారు. దీన్ని రూ.50 వేలలోపు ధరకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు మరెన్నో ఫీచర్లు కూడా ఉన్నాయి.
Flipkart Big Diwali Sale: దీపావళి సేల్ ఎట్టకేలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన షాపింగ్ వెబ్‌సైట్‌లలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్... దుర్గా పూజకు ముందు బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఇందులో ఐఫోన్ 15తో సహా వేలాది ఉత్పత్తులు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్...
ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఉత్సవ్ షాపింగ్ డేస్‌ను ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ దీపావళి సేల్‌ను కూడా ప్రకటించింది. దీనికి ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ అని పేరు పెట్టారు. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న డీల్స్‌ను కూడా కంపెనీ వెల్లడించింది. ఐఫోన్ 15పై వినియోగదారులు మరోసారి భారీ తగ్గింపును పొందగలుగుతారు.
ఒకవేళ మీ దగ్గర ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్ ఉంటే ఈ సేల్‌లో అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024 అక్టోబర్ 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ సభ్యుల కోసం ఈ సేల్ 24 గంటల ముందు అంటే నేడు (అక్టోబర్ 20వ తేదీ) అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్... ఎస్‌బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాబట్టి ఎస్‌బీఐ కార్డ్‌తో చెల్లించడం ద్వారా కొనుగోళ్లు చేస్తే కస్టమర్‌లు 10 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందుతారు. ఇది ఆ ఉత్పత్తిపై అందించే సేల్ డిస్కౌంట్‌కి అదనంగా ఉంటుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
దీపావళి సేల్‌లో మొబైల్ డీల్స్...
ఐఫోన్ 15: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో వినియోగదారులు ఐఫోన్ 15ని కేవలం రూ.49,999కి కొనుగోలు చేయగలుగుతారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ: ఈ సేల్‌లో వినియోగదారులు గెలాక్సీ ఏఐ ఫీచర్లతో కూడిన శాంసంగ్ ఈ ప్రీమియం ఫోన్‌ని రూ. 37,999కి కొనుగోలు చేయగలుగుతారు.
యాపిల్ ఎయిర్‌పాడ్స్: ఈ సేల్‌లో వినియోగదారులు కేవలం రూ. 10,000 కంటే తక్కువ ధరతో యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ను కొనుగోలు చేయగలుగుతారు.
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో ప్రతి గంటకు బాంబ్ డీల్‌ను నిర్వహిస్తారు. ఈ డీల్‌లో కొన్ని అదనపు తగ్గింపులు, ఆఫర్‌లు అందించనున్నారు. ఇది మాత్రమే కాకుండా సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ మరిన్ని ఆఫర్‌లను వెల్లడిస్తుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే