iPhone 14 Offer: ఐఫోన్ 14, 15పై భారీ డిస్కౌంట్ - కొనాలనుకుంటే కరెక్ట్ టైమ్!
iPhone 14 Price Cut: యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 15లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
iPhone 14 Price Drop: మీరు తక్కువ ధరలో ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే కరెక్ట్ టైమ్. ఐఫోన్ 14లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై 17 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.69,990 కాగా ఇప్పుడు రూ.57,999కే కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు తగ్గింపు లభించనుంది. ఒకవేళ మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకుంటే రూ.34,500 వరకు తగ్గింపు లభించనుంది. అయితే ఈ ఎక్స్‌ఛేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ కండీషన్ మీద ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 15పై కూడా...
ఐఫోన్ 15పై కూడా రూ.8,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. క్రోమా, ఇన్వెంట్ స్టోర్లలో ఈ ఆఫర్ అందించారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5,000 తగ్గింపు లభించనుంది. అలాగే పేమెంట్ పేజీలో రూ.3,000 అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. దీంతో ఐఫోన్ 15ను రూ.71,990కే కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15, 15 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా...
ఐఫోన్ 15లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. అదనపు ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. గతేడాది ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో ఇచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఐఫోన్ 15 సిరీస్‌లో కూడా కంపెనీ అందించింది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ డెలివర్ చేయనుంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఈ సిరీస్‌లో ఉన్నాయి. ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది.
ఈ రెండు ఫోన్లలోనూ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరాను యాపిల్ అందించింది.
ఏ16 బయోనిక్ చిప్‌పై యాపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మొబైల్స్ పని చేయనున్నాయి. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఈ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. యూఎస్‌బీ టైప్-సీతో లాంచ్ అయిన మొట్టమొదటి యాపిల్ ఐఫోన్ సిరీస్ ఇదే కావడం విశేషం.
మరోవైపు వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై పని చేస్తోంది. దీని ద్వారా త్వరలో మీరు నంబర్‌లను మార్చుకోకుండానే వాట్సాప్‌లో ఒకరితో ఒకరు కనెక్ట్ కాగలరు. ఇది వెబ్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి రావడం మొదలైంది. యూజర్ నేమ్ ఫీచర్ కింద మీరు కేవలం యూజర్ నేమ్ సహాయంతో మీ వాట్సాప్‌కి ఎవరితో అయినా చాట్ చేయవచ్చు. దీని కారణంగా నంబర్ కూడా కనిపించదు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!