అన్వేషించండి

Instagram New Feature: యూజర్ల ఓపికను పరీక్షిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ - ఇక యూట్యూబ్ తరహాలోనే!

Instagram New Feature: సోషల్ మీడియా యాప్స్ అన్నింటిలో యూజర్లు ఎక్కువగా ఉపయోగించేది ఇన్‌స్టాగ్రామ్. ఇప్పటికే ఈ యాప్‌లో ఎన్నో కొత్త ఫీచర్లు రాగా తాజాగా మరో ఫీచర్ యూజర్ల ఓపికను టెస్ట్ చేస్తోంది.

Instagram Ad Break Feature: ఒకప్పటి సోషల్ మీడియాకు ఇప్పటి సోషల్ మీడియాకు చాలా మార్పులు వచ్చాయి. యూజర్స్ పెరుగుతున్నకొద్దీ సోషల్ మీడియా కేటగిరికి చెందే ఎన్నో యాప్స్.. కొత్త కొత్త మార్పులను తీసుకొస్తున్నాయి. అప్డేట్స్ పేరుతో ఈ యాప్స్ చేస్తున్న మార్పులు చాలామంది యూజర్లకు నచ్చకపోయినా సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వడంతో వేరే దారిలేక ఉపయోగిస్తున్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కొత్తగా వచ్చిన అప్డేట్.. యూజర్స్ ఓపికను టెస్ట్ చేస్తోంది. ఇతర సోషల్ మీడియా యాప్స్‌తో పోలిస్తే ప్రస్తుతం యూజర్లు ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌కే అడిక్ట్ అవుతుండగా.. దీనిని క్యాష్ చేసుకోవాలని మెటా సంస్థ నిర్ణయించుకుంది.

కొత్త ఫీచర్..

ప్రస్తుతం మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అయిన ఇన్‌స్టాగ్రామ్.. ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోంది. అదే ‘అన్‌స్కిప్పెబుల్ యాడ్స్’. ఇప్పటికే యూట్యూబ్‌లో అన్‌స్కిప్పెబుల్ యాడ్స్ అనేవి యూజర్ల ఓపికను టెస్ట్ చేస్తున్నాయి. ఇక ఈ యాడ్స్ అనేవి త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎంటర్ అవ్వనున్నాయి. ప్రస్తుతం కొంతమంది యూజర్లను మాత్రమే ఎంపిక చేసి ఈ అన్‌స్కిప్పెబుల్ యాడ్స్ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది మెటా. కానీ దీని గురించి మెటా.. ఇంకా ఏ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ అన్‌స్కిప్పెబుల్ యాడ్స్ ఫీచర్‌కు ‘యాడ్ బ్రేక్స్’ అని పేరు కూడా పెట్టింది. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘యాడ్ బ్రేక్స్’ను ఎక్స్‌పీరియన్స్ చేసినవారు వాటి గురించి ట్విటర్‌లో పోస్ట్ కూడా చేస్తున్నారు.

యాడ్ బ్రేక్స్..

‘నా ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ మళ్లీ యాడ్ బ్రేక్ అని వస్తుంది. అందుకే ఈసారి ఇన్ఫో అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి చూశాను. యూజర్లకు ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు’ అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘యాడ్ బ్రేక్’ ఫీచర్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌ను విరామం లేకుండా స్క్రోల్ చేసేవారు కచ్చితంగా 3 నుంచి 5 సెకండ్ల వరకు ఒక అన్‌స్కిప్పెబుల్ యాడ్‌ను చూడాల్సిందే. ఒకవేళ గంటలపాటు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తూ ఉంటే ఈ యాడ్ బ్రేక్స్ అనేవి ఎన్నిసార్లు కనిపిస్తాయో చెప్పలేం. ఇది తెలిసిన యూజర్లు.. ఇన్‌స్టాగ్రామ్ ఇలాగే ఉంటే ఉపయోగించడం మానేస్తామని తమ ఫ్రస్ట్రేషన్‌ను బయటపెడుతున్నారు.

యూట్యూబ్‌ను ఫాలో..

యాడ్ బ్రేక్స్‌కు యూజర్ల రియాక్షన్‌ను బట్టి ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మెటా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక యూట్యూబ్ కూడా మొదట్లో ఇలాగే 5 సెకండ్ల అన్‌స్కిప్పెబుల్ యాడ్స్‌తో మొదలుపెట్టి ఇప్పుడు దాదాపుగా నిమిషం పాటు ఈ యాడ్స్‌ను ప్లే చేస్తోంది. దీంతో యూజర్లు తమ ఓపికను కోల్పోతున్నారు. ఒకవేళ యాడ్స్ వద్దనుకుంటే ప్రీమియం కొనాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్ కూడా అదే కేటగిరిలో చేరుతుందేమోనని భయపడుతున్నారు. యాడ్స్ లేకుండా ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించాలంటే ప్రీమియం కొనాలంటూ ఒత్తిడి తీసుకొస్తారేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మెటా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చేవరకు యూజర్లు కన్‌ఫ్యూజన్‌లో ఉండాల్సిందే.

Also Read: గేమింగ్ హబ్‌గా మారుతున్న యూట్యూబ్ - ప్లేయబుల్స్‌ను లాంచ్ చేసిన కంపెనీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget