అన్వేషించండి

Infinix Hot 40i: 256 జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రూ.10 వేలలోపే - ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ లాంచ్!

Infinix Hot 40i Price in India: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ.

Infinix New Phone: ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కొన్ని నెలల క్రితం ఈ ఫోన్ సౌదీ అరేబియాలో ఎంట్రీ ఇచ్చింది. ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇవి ఏఐని సపోర్ట్ చేస్తాయి. ఫోన్ ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది. నాలుగు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ ధర
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.9,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. హారిజన్ గోల్డ్, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్, స్టార్‌ఫాల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 480 నిట్స్‌గా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 89.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. దీన్ని వర్చువల్‌గా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13.0 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ రన్ కానుంది.

కెమెరా విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ ఆధారిత సెన్సార్ అందించారు. క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.

యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో మ్యాజిక్ రింగ్ ఫీచర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. 256 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. వైఫై, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ టైప్-సీ, జీపీఎస్, ఎఫ్ఎం, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కూడా సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.

మరోవైపు మోటో జీ04 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో యూనిసోక్ ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోటో జీ04లో ఉన్నాయి. ర్యామ్‌ను ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్ వెనకవైపు సింగిల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ముందువైపు సెల్ఫీ కెమెరాను అందించారు.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget