Google Translate: గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో ఎనిమిది కొత్త భారతీయ భాషలు - ఆ ప్రాచీన భాష కూడా!
గూగుల్ తన ట్రాన్స్‌లేట్ సర్వీస్‌లో 24 కొత్త భాషలను చేర్చింది. అందులో సంస్కృతం కూడా ఉంది.

ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వారికి గూగుల్ ట్రాన్స్‌లేట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన అర్థాలు, అనువాదాల కోసం దాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం. ఇప్పుడు గూగుల్ ఈ ట్రాన్స్‌లేషన్ సర్వీసుకు మరో 24 భాషలను జోడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 133 భాషల్లో ఈ గూగుల్ ట్రాన్స్‌లేట్ అందుబాటులో ఉంది. కొత్తగా జోడించిన 24 భాషల్లో సంస్కృతం కూడా ఉంది.
‘కొత్తగా యాడ్ చేసిన భాషలను మాట్లాడేవారు ప్రపంచంలో 30 కోట్ల మంది వరకు ఉన్నారు. మిజో భాషను భారతదేశంలో ఎనిమిది లక్షల మంది మాట్లాడతారు. అలాగే లింగల భాష మాట్లాడే వారు సెంట్రల్ ఆఫ్రికాలో 4.5 కోట్ల మందికి పైగా ఉన్నారు.’ అని గూగుల్ ట్రాన్స్‌లేట్ సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఐజాక్ కాస్వెల్ అన్నారు.
గూగుల్ కొత్తగా యాడ్ చేసిన 24 భాషల్లో ఎనిమిది భారతీయ భాషలు కూడా ఉన్నాయి. డోగ్రీ (ఉత్తర భారతదేశం), కొంకణి (మధ్య భారతదేశం), అస్సామీస్ (ఈశాన్య భారతదేశం), భోజ్‌పురి (ఉత్తర భారతదేశం), మైథిలి (ఉత్తర భారతదేశం), మణిపురి (ఈశాన్య భారతదేశం), మిజో (ఈశాన్య భారతదేశం), సంస్కృతం భాషలు ఈ జాబితాలో ఉన్నాయి.
జీరో షాట్ మెషీన్ టెక్నాలజీ ద్వారా ఈ భాషలను యాడ్ చేశామని గూగుల్ తెలిపింది. కంపెనీ సాధించిన కొత్త టెక్నికల్ ఫీట్ ఇదే. అయితే ఈ ట్రాన్స్‌లేషన్ ఇంకా పర్‌ఫెక్ట్‌గా రాలేదని, దాని కోసం తాము ప్రయత్నిస్తామని పేర్కొంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
Before You Go
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
ట్రెండింగ్ వార్తలు





















