Google Pixel 8: ఈ గూగుల్ ఫోన్‌పై భారీ ఆఫర్ - సగం కంటే తక్కువ ధరకే!
Google Pixel 8 Price Drop: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 8ను దాదాపు సగం కంటే తక్కువ ధరకే కొనేయచ్చు.
Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వీఐపీ మెంబర్స్, ప్లస్ మెంబర్స్ మాత్రమే ఈ సేల్‌లో పాల్గొనగలరు. అయితే ఈ సేల్ అక్టోబర్ 21 అర్ధరాత్రి 12 గంటల నుంచి సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానుంది.
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ప్రారంభం
ఈ సేల్‌లో పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల్లో లభించే అత్యుత్తమ డీల్‌ల గురించి చెప్పాలంటే గూగుల్ పిక్సెల్ 8పై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 256 జీబీ వేరియంట్‌ను దాని లాంచ్ అయిన ధరలో సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై లభించే తగ్గింపు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లాంచ్ అయిన సమయంలో గూగుల్ పిక్సెల్ 8కు సంబంధించిన 256 జీబీ వేరియంట్ ధర రూ.82,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన దీపావళి సేల్‌లో ఈ ఫోన్ కేవలం రూ. 42,999 ధరతో జాబితా చేయబడింది. మీరు ఎలాంటి బ్యాంక్ డిస్కౌంట్ లేకుండా కూడా ఈ ఫోన్‌ని సగం ధరకే కొనుగోలు చేయవచ్చు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
ఇది కాకుండా వినియోగదారులు ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్‌తో పేమెంట్ చేయడం ద్వారా 10 శాతం అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ ఫోన్ హాజెల్ కలర్ వేరియంట్‌ను కేవలం రూ. 36,499కి ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు.
గూగుల్ పిక్సెల్ 8పై గొప్ప ఆఫర్‌లు అందుబాటులో...
ఇది కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్‌పై రూ. 42,450 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. అదే విధంగా ఈ ఫోన్ ఇతర వేరియంట్లపై కూడా అనేక గొప్ప తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ 8లో 6.2 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో ప్రాసెసర్‌గా గూగుల్ టెన్సార్ టీ3 చిప్‌సెట్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి. ఆడియో మ్యాజిక్ ఎరేజర్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ వెనుక భాగంలో ఉన్నాయి. ఈ ఫోన్ 4575 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
Ahh, that new phone feeling 😌
— Made by Google (@madebygoogle) August 22, 2024
Engineered by Google, #Pixel9 and Pixel 9 Pro get the best of Google’s AI first, so you can take amazing photos and get things done even easier.
Get all the feels: https://t.co/r1E9ntWsEa pic.twitter.com/4mdTSRGxYs