News
News
X

ఏంటి! భూమ్మీద ఇన్ని ఫోన్లు ఉన్నాయా - ఏకంగా 530 కోట్ల మొబైల్స్ చెత్తబుట్టలోకి!

ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 530 కోట్ల ఫోన్లు చెత్తబుట్టలోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది.

FOLLOW US: 
 
సాధారణంగా మొబైల్ తయారీ కంపెనీలు పనికిరాని మొబైల్స్ నుంచి బంగారం, వెండి, రాగి, పెల్లీడియం వంటి విలువైన లోహాలను రీసైకిల్ చేస్తాయి. అయితే ఈసారి ఏకంగా దాదాపుగా 530 కోట్ల వరకు మొబైల్ ఫోన్స్‌ను వినియోగదారులు వాడటం నిలిపివేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఎక్కువ భాగం మొబైల్స్‌ను పారేయడం ఇష్టం లేక ఇళ్లలో పెట్టుకుంటారు. కొంతమంది మాత్రం పారేస్తూ ఉంటారు.

కొత్త గ్లోబల్ సర్వే ప్రకారం ఈరోజు ఒక్కో కుటుంబం ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ టూల్స్, హెయిర్ డ్రైయర్‌లు, టోస్టర్‌లు, ఇతర ఉపకరణాలు (ల్యాంప్‌లు మినహా) వంటి సగటున 74 ఈ-ఉత్పత్తులను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం చాలా మంది రెండు ఫోన్లు ఉపయోగిస్తున్నారు. కొంతమంది కొత్త ఫోన్ కొన్నాక పాత ఫోన్‌కు మంచి రేటు రాలేదని వాడకుండా పక్కన పడేస్తారు అవసరం ఉన్నప్పుడు బ్యాకప్ ఫోన్‌గా ఉపయోగించుకుందాం అని. ఇలా రకరకాల కారణాల వల్ల ఈ-వేస్ట్ పెరిగిపోతుంది.

ఆ 74 ఈ-ఉత్పత్తులలో 13 ఉపయోగించకుండా పక్కన ఉన్నాయి (వాటిలో 9 ఉపయోగించనివి కానీ పని చేస్తున్నాయి, 4 విరిగిపోయాయి). అనేక గృహాలు, వ్యాపార సంస్థలు మరమ్మత్తు లేదా రీసైక్లింగ్ కోసం వేస్ట్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతున్నాయి అని వెల్లడించడానికి నిర్వహించిన సర్వేల ఫలితాల ప్రకారం, వినియోగదారులు ఎక్కువగా నిల్వ చేసే చిన్న ఉత్పత్తులలో మొబైల్ ఫోన్‌లు 4వ స్థానంలో ఉన్నాయి.

ఈ కథనం ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,600 కోట్ల మొబైల్ ఫోన్లు ఉపయోగంలో ఉన్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు, టోస్టర్‌లు, కెమెరాల వంటి చిన్న వస్తువులు మొత్తం 24.5 మిలియన్ టన్నుల బరువును కలిగి ఉంటాయని అంచనా. ఇది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఈ-వేస్ట్‌పై దృష్టి సారించకపోతే ఇది ప్రమాదమైన సమస్యగా మారనుంది.

News Reels

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by YouFinance™ (@youfinance.in)

Published at : 15 Oct 2022 10:33 PM (IST) Tags: Environment E-Waste WEEE Mobile Phones E-Waste Electronic Waste

సంబంధిత కథనాలు

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

యూరోప్ బాటలో ఇండియా కూడా - ఈ-వేస్ట్ తగ్గించడానికి కఠిన నిర్ణయం!

యూరోప్ బాటలో ఇండియా కూడా - ఈ-వేస్ట్ తగ్గించడానికి కఠిన నిర్ణయం!

GST Law Panel: 'గేమ్స్ ఆఫ్ స్కిల్', 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై జీఎస్టీ ఎంత? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాతే నిర్ణయం!

GST Law Panel: 'గేమ్స్ ఆఫ్ స్కిల్', 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై జీఎస్టీ ఎంత? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాతే నిర్ణయం!

Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!

Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!

Netflix Profile Transfer: అందుబాటులోకి నెట్ ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్, ఇక పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్!

Netflix Profile Transfer: అందుబాటులోకి నెట్ ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్, ఇక పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్!

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

President Droupadi Murmu : నేడు ఏపీకి ద్రౌపదీ ముర్ము, నేవీ డే కార్యక్రమాల్లో పాల్గోనున్న రాష్ట్రపతి

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

IND vs BAN 1st ODI: నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

IND vs BAN 1st ODI:  నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!