అన్వేషించండి

Apple WWDC 2026: ఆపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 27తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌! మీ చేతిపై భవిష్యత్‌ టెక్నాలజీ!

ఆపిల్‌ వార్షిక డెవలపర్‌ కాన్ఫరెన్స్‌(WWDC 2026) వేదికగా వినియోగదారుల కోసం విప్లవాత్మక మార్పులు ప్రకటించింది. సరికొత్త వాచ్‌ ఓఎస్‌ 27 అప్‌డేట్ ద్వారా మీ వ్యక్తిగత ఏఐ అసిస్టెంట్‌గా మారబోతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆపిల్ ఇంటెలిజెన్స్ సిరి, వ్యక్తిగత విషయాలు అర్థం చేసుకొని ప్రతిస్పందిస్తుంది.
  • పెరిమోనోపాజ్ ట్రాకింగ్, ఏఐ ఆధారిత వర్కౌట్ బడ్డీ నూతన ఫీచర్లు.
  • లిక్విడ్ గ్లాస్, సింగిల్ ట్యాప్ గెస్టర్ వాడకాన్ని సులభతరం చేస్తుంది.
  • ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో సిరి ఇప్పుడు మీ వ్యక్తిగత విషయాలను అర్థం చేసుకొని మాట్లాడగలదు. 
  • పెరిమోనోపాజ్, మోనోపాజ్ ట్రాకింగ్‌తోపాటు ఏఐ ఆధారిత వర్కౌట్‌ బడ్డీ ఫీచర్లు పరిచయం చేసింది. 
  • లక్విడ్‌ గ్లాస్‌ డిజైన్, సింగిల్ ట్యాప్‌  గెస్టర్‌, డైనమిక్‌ యాప్‌ గ్రిడ్‌తో  వాచ్‌ వాడకం మరింత సులభతరం కానుంది. 

ఆపిల్‌ వాచ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. WWDC2026లో ఆవిష్కరించింది. వాచ్‌ ఓఎస్‌ 27వినియోగదారుల అనుభవాన్ని పూర్తిగా మార్చేయనుంది. ఈ అప్‌డేట్‌లో అన్నింటికంటే ముఖ్యమైంది సిరిఏఐ. ఇది ఆపిల్  ఇంటెలిజెన్స్‌ శక్తితో పని చేస్తుంది. మునుపటిలా కాకుండా సిరి ఇప్పుడు మీ మాటలను మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. మీరు ఇచ్చే ఆదేశాలను కేవలం పాటించడమే కాకుండా మీ వ్యక్తిగత అవసరాలను బట్టి సమాధానాలు ఇవ్వగలదు. నోట్స్, మెసేజ్‌ల నుంచి సమాచారాన్ని వెలికితీసి మీకు అందిస్తుంది. 

మీ పర్సనల్ అసిస్టెంట్‌

సిరి కోసం ఆపిల్ ఒక ప్రత్యేకమైన యాప్‌ను కేటాయించింది.ఇక్కడ మీ మాటలను ఒకే చోట భద్రంగా ఉంటాయి. దీని వల్ల పాత విషయాలను మళ్లీ అడగాల్సిన పని ఉండదు. ఈ ఏఐ ఫీచర్‌ ద్వారా ఈమెయిల్స్‌ పంపడం, ప్లేలిస్ట్‌లను మేనేజ్‌ చేయడం, ట్రావెల్‌ వివరాలను తెలుసుకోవడ వంటివి వాచ్ నుంచే సులభంగా చేయవచ్చు. మరీ ముఖ్యంగా సిరి సూచించే డైనమిక్‌ యాప్ గ్రిడ్‌ మీరు ఎక్కువగా వాడే యాప్‌లను ఆటోమేటిక్‌గా హైలెట్‌ చేస్తుంది. దీని వల్ల సమయం చాలా ఆదా అవుతుంది. 

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ఏఐ సాయం 

ఫిట్‌నెస్‌ ప్రియుల కోసం ఆపిల్ వర్కౌట్‌ బడ్డీని అప్‌గ్రేడ్ చేసింది. ఇది మీ గత వర్కౌట్ హిస్టరీ, పేస్‌, డిస్టెన్స్‌ను విశ్లేషించి మీకు తగిన సలహాలు ఇస్తుంది. ఇండోర్‌ రన్నింగ్‌ చేసే వారికి మొబైల్ లేకపోయినా కచ్చితమైన రీడింగ్స్‌ ఇచ్చేలా అల్గారిథమ్స్‌ను మార్చారు. ఇప్పుడు ఇది స్పానిష్‌ భాషను కూడా సపోర్ట్ చేస్తుంది. మహిళల ఆరోగ్యం విషయంలో ఆపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. హెల్త్ యాప్‌లో పెరిమోనోపాజ్, మోనోపోజ్‌ లక్షలను ట్రాక్ చేస్తుంది. 

ఇంటర్‌ఫేస్ మార్పులు 

యూజర్ల కోసం ఆపిల్ సింగిల్ టాప్ గెస్చర్‌ను ప్రవేశపెట్టింది. కేవలం బొటనవేలు, చూపుడు వేలును కలిపి ఒక్కసారి ట్యాప్‌ చేస్తే స్మార్ట్ స్టాక్ విడ్జెట్స్‌ ఓపెన్ అవుతాయి. లిక్విడ్ గ్లాస్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా డిస్‌ప్లేపై అక్షరాలు మరింత స్పష్టంగా , కాంట్రాస్ట్‌తో కనిపిస్తాయి. దీని వల్ల చదవడం సులభమవుతుంది. వాలెట్ యాప్‌లో ఇకపై కస్టమ్ పాస్‌లను క్యూఆర్ కోడ్‌ల ద్వారా స్టోర్ చేసుకోవచ్చు. లైబ్రరీ కార్డ్స్‌, మెంబర్‌షిప్ కార్డ్స్‌ అన్నీ మీ వాచ్‌లోనే ఉంటాయి. 

కాల్‌ కాంటెక్ట్స్‌ 

ఫోన్ కాల్స్‌  మాట్లాడుతున్నప్పుడు మీకు అవసరమైన సమాచారాన్ని వాచ్ స్క్రీన్‌పైనే చూపిస్తుంది. ఫైండ్‌ మై యాప్‌ను కూడా ఆపిల్ సరళీకరించింది. వ్యక్తులు,పరికరాలు, వస్తువులను ఒకే మ్యాప్‌ ఇంటర్‌ఫేస్‌లో చూడవచ్చు. బ్యాటరీ లైఫ్ పెంచడానికి బ్యాటరీ అప్టిమైజేషన్ రికమండేషన్స్‌ కూడా ఈ కొత్త ఓఎస్‌లో భాగమయ్యాయి. 

ఏయే మోడల్స్ సపోర్ట్ చేస్తాయి?

ఈ అద్భుతమైన ఫీచర్లు పొందాలంటే మీ దగ్గర ఆపిల్ వాచ్‌ సిరీస్‌ 10, 11, ఆపిల్‌ వాచ్‌ ఆల్ట్రా 2, 3, ఆపిల్ వాచ్‌ ఎస్‌ఈ 3 ఉండాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీని కోసం మీ ఐఫోన్ ఐఓఎస్ 27తో పని చేస్తూ ఉండాలి. అలాగే ఐఫోన్ 11 లేదా ఆపై మోడల్స్ అవసరం. 

Frequently Asked Questions

ఆపిల్ ఇంటెలిజెన్స్ సాయంతో సిరి ఎలా మెరుగుపడింది?

ఆపిల్ ఇంటెలిజెన్స్ శక్తితో సిరి మీ మాటలను మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ఇది మీ వ్యక్తిగత అవసరాలను బట్టి సమాధానాలు ఇస్తుంది, నోట్స్, మెసేజ్‌ల నుండి సమాచారాన్ని వెలికితీస్తుంది.

ఆపిల్ వాచ్‌లో ఆరోగ్య, ఫిట్‌నెస్‌కు సంబంధించిన కొత్త ఫీచర్లు ఏమిటి?

ఏఐ ఆధారిత వర్కౌట్ బడ్డీ మీ గత వర్కౌట్ చరిత్రను విశ్లేషించి సలహాలు ఇస్తుంది. మహిళల ఆరోగ్యం కోసం హెల్త్ యాప్‌లో పెరిమోనోపాజ్, మోనోపాజ్ ట్రాకింగ్ ఫీచర్లు చేర్చబడ్డాయి.

ఈ కొత్త ఫీచర్లను ఏ ఆపిల్ వాచ్ మోడల్స్ సపోర్ట్ చేస్తాయి?

ఈ కొత్త ఫీచర్లు ఆపిల్ వాచ్ సిరీస్ 10, 11, ఆల్ట్రా 2, 3, ఎస్‌ఈ 3 మోడల్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఐఓఎస్ 27తో పనిచేసే ఐఫోన్ 11 లేదా ఆపై మోడల్ కూడా అవసరం.

టాప్ హెడ్ లైన్స్

Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Embed widget