Find a lost phone: మీ ఫోన్ పోయిందా ?.. నో ప్రాబ్లమ్ ఇలా చేస్తే దొరుకుతుంది సింపుల్!
ఫోన్ పోయిందా.. తెగ కంగారు పడి పోతున్నారా? అస్సలు అవసరం లేదు. ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయితే చాలు. ఎక్కడున్నా.. మీ ఫోన్ మళ్లీ మీ దగ్గరకే వచ్చేస్తుంది.
మీ మొబైల్ ఫోన్ పోయిందా? అమ్మ తిడుతుంది.. నాన్న ఏం అంటాడో అని భయపడిపోతున్నారా? అవసరమే లేదు. ఎక్కడికి పోలేదు.. ఈజీ అంటే చాలా ఈజీగా దొరికేస్తుంది. ఫోన్ దొరకబట్టడానికి చాలా టూల్స్ ఉన్నాయి. ఎక్కడ ఫోన్ పోయినా ఈజీగా దొరికేస్తుంది. ఇంతకీ మీది ఐఫోన్ ఆ.. లేక ఆండ్రాయిడ్ ఫోనా.. ఏదైతేనేం.. దొరుకుతుందిలే. మీ ఫోన్ లోకేషన్ కూడా ఆ టూల్స్ చెప్పేస్తాయి. ఓహో ఫోన్ స్వీచ్ఛాఫ్ లో ఉంటే ఎలా అని థింక్ చేస్తున్నారా? ఇది కాస్త కష్టమే.. కానీ దీనికి కూడా టూల్స్ ఉన్నాయి.
మీ ఫోన్ ఎవరైనా దొంగిలించినా.. లేదా పొగొట్టుకున్నా.. దొరికేస్తుంది. ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ తో ఈజీగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ ట్రాక్ చేయోచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒకటే.. ముందుగా మీ గూగుల్ అకౌంట్ కు లాగిన్ అవ్వాలి. మీ ఫోన్ తో లింగ్ అయి కచ్చితంగా ఉండాలి. తర్వాత ఫైండ్ మై డివైస్ అనే సైటులోకి వెళ్లాలి. అక్కడే మీ జీ మెయిల్ తో లాగిన్ అవ్వాలి. అందులో ఓ మెను కనిపిస్తుంది. మీ ఫోన్ ఏదో సెలక్ట్ చేసుకోవాలి. లొకేషన్ సెలక్ట్ చేయగానే ఓ మ్యాప్ వస్తుంది. అందులో మీ ఫోన్ లొకేషన్ మీకు అతిదగ్గరలో ఉంటే వెంటనే ప్లే సౌండ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆగకుండా 5 నిమిషాల పాటు అలారం మోగుతూనే ఉంటుంది. సైలెండ్ మోడ్ లో ఉన్నా సరే.. మెగుతుంది.
ఐ ఫోన్ల కోసం ప్రత్యేక టూల్ ఒకటి ఉంది. అదే ఫైండ్ మై ఐ ఫోన్ టూల్. మీ ఐఫోన్ లొకేషన్ కనిపెట్టంలో ఈ టూల్ సూపర్ అని చెప్పొచ్చు. మీరు ఏం చేయాలంటే.. iCloud.comలోకి వెళ్లాలి.. అక్కడ ఫైండ్ మై ఐ ఫోన్ టూల్ యాక్సిస్ చేయాలి. దీనిలో సైన్ అవ్వాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అక్కడ ఆల్ డివైసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఆ లిస్టులో మీ ఫోన్ ను సెలక్ట్ చేయాలి. మీ స్క్రీన్ పై ఫోన్ లోకేషన్ తో ఒక మ్యాప్ కనిపిస్తుంది.
ఒకవేళ ఫోన్ స్విచ్చాఫ్ అయితే..
ఐఫోన్ స్విచ్చాఫ్ అయినా కూడా ఈజీగా లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ ఫోన్ లొకేషన్ వాడినప్పుడు.. ఫోన్ ఆఫ్ లైన్ లో ఉన్నా కూడా అది ఆఫ్ లైన్ లోకి వెళ్లడానికి ముందు ఏ లొకేషన్ లో ఉందో ట్రాక్ చేస్తుంది. మ్యాప్ ద్వారా అప్పటి లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. మీ ఐఫోన్ ఎవరైనా ఆన్ చేస్తే.. వెంటనే మీకు ఈమెయిల్ వస్తుంది. అందుకు మీరు చేయాల్సిందిల్లా.. నోటిఫై అనే ప్షన్ ఎంచుకుంటే చాలు...
ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఇలానే ట్రాక్ చేసెయోచ్చు. అదే.. ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే మాత్రం లొకేషన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉండాలి. ఆన్ లైన్ లో ఉంటేనే ఫోన్ లొకేషన్ కనిపెట్టేందుకు సాధ్యపడుతుంది.