అన్వేషించండి

Elon Musk: పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !

Anysphere Cursor AI: పాకిస్తాన్ స్నేహితుడితో పాటు మరికొందరితో కలిసి భారతీయ యువకుడు ఓ స్టార్టప్ పెట్టాడు. దాన్ని ఐదు లక్షల కోట్లకు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు.

India born Aman Sanger youngest AI billionaire:   ప్రపంచ టెక్నాలజీ రంగంలో సరికొత్త చరిత్ర  . ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్  నేతృత్వంలోని సంస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోడింగ్ అసిస్టెంట్ కర్సర్  మాతృసంస్థ అనిస్పియర్ ను ఏకంగా 60 బిలియన్ డాలర్లు  అంటే  సుమారు రూ. 5 లక్షల కోట్లు  భారీ డీల్‌తో సొంతం చేసుకున్నారు.  ఈ మెగా డీల్‌తో భారత్‌కు చెందిన 25 ఏళ్ల అమన్ సాంగర్, పాకిస్తాన్‌కు చెందిన 26 ఏళ్ల స్వాలెహ్ ఆసిఫ్‌లు రాత్రికి రాత్రే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్లుగా అవతరించి గ్లోబల్ లైమ్‌లైట్‌లోకి వచ్చారు.
  
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో చదువుకునే రోజుల్లో కేవలం ఒక చిన్న యూనివర్సిటీ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన  కర్సర్ AI .. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ కంపెనీగా రికార్డు సృష్టించింది. ఎలాన్ మస్క్ చేసుకున్న  ఒప్పందం ద్వారా సహ-వ్యవస్థాపకులైన అమన్ సాంగర్, స్వాలెహ్ ఆసిఫ్‌లకు తలా 2.7 బిలియన్ డాలర్ల సుమారు రూ. 22 వేల కోట్లు చొప్పున లభించనున్నాయి. ప్రస్తుతం ఈ కోడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఎన్విడియా, అడోబ్, ఉబెర్, షాపిఫై, పేపాల్ వంటి ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది డెవలపర్లు ఉపయోగిస్తున్నారు.

 ఎవరీ అమన్ సాంగర్? 

కేవలం 25 ఏళ్ల ప్రాయంలోనే ఏఐ పరిశ్రమలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు అమన్ సాంగర్. అమెరికాలో స్థిరపడిన భారతీయ   దంపతులకు జన్మించిన అమన్‌కు చిన్నతనం నుంచే వ్యాపార, విద్యా వాతావరణం లభించింది. ఆయన తండ్రి అరవింద్ సాంగర్ ఐఐటీ బాంబే   పూర్వ విద్యార్థి కాగా, తల్లి శిల్పా సాంగర్ ముంబైలో పెరిగి వైద్య రంగంతో పాటు స్టార్టప్ ఇన్వెస్టర్‌గా రాణించారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో 14 ఏళ్ల వయస్సులోనే కోడింగ్ నేర్చుకున్న అమన్, ఎంఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. గతంలో గూగుల్, బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌లో ఇంటర్న్‌షిప్స్ చేసిన ఈ యువకుడు, ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి  కర్సర్ కు పునాది వేశారు.   

 గణిత మేధావి నుంచి టెక్ ఫౌండర్‌గా స్వాలెహ్ ఆసిఫ్ 

పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన 26 ఏళ్ల స్వాలెహ్ ఆసిఫ్‌కు గణితం, కంప్యూటర్ సైన్స్‌లో అసాధారణమైన ప్రతిభ ఉంది. ఫోర్బ్స్  కథనం ప్రకారం.. ఆయన 2016 నుండి 2018 వరకు అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభను చాటుకున్నారు. ఎంఐటీలో చదువుతున్న రోజుల్లోనే ఒక ఏఐ-ఆధారిత సెర్చ్ ఇంజిన్ స్టార్టప్‌ను స్థాపించిన అనుభవం ఆయనకుంది. ఆ తర్వాత అమన్ సాంగర్, మైఖేల్ ట్రూయెల్, అర్విద్ లున్నెమార్క్‌లతో జతకట్టి  కర్సర్ ను ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఏఐ కోడింగ్ సాధనంగా తీర్చిదిద్దారు.

 ఏడాదికి  బిలియన్ డాలర్ల ఆదాయం 

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ను ఆటోమేట్ చేసే ఏఐ కోడింగ్ టూల్స్ విభాగంలో  కర్సర్  సరికొత్త విప్లవాన్ని తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 కంపెనీలు దీని సేవలను వాడుకుంటుండటంతో, ఈ సంస్థ వార్షిక రన్-రేట్ ఆదాయం 1 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ కోడింగ్ చేసే పద్ధతినే మార్చేస్తున్న ఈ స్టార్టప్‌పై ఎలాన్ మస్క్ కన్నుపడటం, దానిని రికార్డు స్థాయి వ్యాల్యుయేషన్‌తో కొనుగోలు చేయడం ఇప్పుడు గ్లోబల్ టెక్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. యువత ధైర్యం చేసి సరికొత్త ఆలోచనలతో వస్తే గ్లోబల్ బిలియనీర్లు కావచ్చు అని చెప్పడానికి ఈ ఇద్దరు సబ్ కాంటినెంట్ యువకులే నిదర్శనం. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget