అన్వేషించండి

AI Benefits And Risks: పని దొంగలు, చేతకాని ఉద్యోగులే AI వాడతారట! అమెరికా యూనివర్శిటీ అధ్యయనంలో సంచలన విషయాలు!

AI Benefits And Risks: ఆఫీసులో AI టూల్స్ వాడతారా? కొత్త పరిశోధన ప్రకారం, మీ సహోద్యోగులు మిమ్మల్ని సోమరులుగా, ఉద్యోగానికే అర్హత లేని వారిగా చూస్తారట.

AI at work: ఈ మధ్య కాలంలో వచ్చిన టెక్నాలజీ అద్భుతం ఏదైనా ఉందీ అంటే అది AI మాత్రమే. ఇంట్లో వంట నుంచి ఆఫీస్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ వరకు అన్నింటినీ క్షణాల్లో చక్కబెట్టేస్తోంది. ఈ టెక్నాలజీ కారణంగా భవిష్యత్‌లో లక్షల్లో ఉద్యోగాలు పోతాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకే  లక్షల మంది ఈ AI టెక్నాలజీ నేర్చుకునే పని పడ్డారు. అయితే ఇప్పుడు నేర్చుకుంటూ తమ పనిలో వాడుతున్న వారిని తోటి వారు ఏమనుకుంటున్నారు... వారి ఆలోచన ఏంటో అమెరికా యూనివర్శిటీ స్టడీ చేసింది. 

ఆఫీసులో ChatGPT, Gemini లేదా Copilot వంటి AI టూల్స్‌ని ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి, ఒక కొత్త పరిశోధన ప్రకారం, మీ సహోద్యోగులు మిమ్మల్ని చాలా దారుణంగా చూస్తున్నారట. అలా చేయడం వల్ల స్మార్ట్ వర్క్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చేమో కానీ తోటి ఉద్యోగులు మాత్రం చేతకాని వాళ్లగాను, తెలివి తక్కువ దద్దమ్మలుగా చూస్తారట. అలాంటి వాళ్లు ఉద్యోగాలు చేయడానికి  'అర్హత లేనివారు'గా భావించవచ్చు. ఈ అధ్యయనం అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయం నిధులతో చేశారు. అనంతరం Proceedings of the National Academy of Sciences ప్రచురించారు.  AI ద్వారా పని వేగంగా చేయవచ్చు. ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతున్నప్పటికీ, ఆఫీసులో దీనికి గుర్తింపు ఉండటం లేదని తాజా అధ్యయనంలో తేలింది.  ఇది  ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది.

పరిశోధనలో వెల్లడైన విషయాలు

పరిశోధనలో చాాల ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఈ పరిశోధనలో 4,400 మంది పాల్గొన్నారు.  నాలుగు వేర్వేరు ఆన్‌లైన్ ప్రయోగాలు జరిపారు.  మొదటి ప్రయోగంలో, ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి వారు AI సహాయం తీసుకుంటే వారి సహచరులు వారిని ఎలా చూస్తారో మిగతాా ఉద్యోగులను  అడిగారు. చాలా మంది ప్రజలు వారిని 'బద్ధకస్తులుగా', 'కష్టపడేందుకు ఇ,ష్టం లేని వారిగా'  'తక్కువ సామర్థ్యం గలవారు'గా భావిస్తారని అంగీకరించారు. కొందరు అటువంటి ఉద్యోగులను సులభంగా మార్చవచ్చని కూడా అన్నారు.

రెండో పరీక్షలో పాల్గొనేవారిని AI టూల్స్‌ని ఉపయోగించే సహోద్యోగులను వర్ణించమని అడిగారు. సమాధానాల్లో ఈ వ్యక్తులు 'డిపెండర్స్‌గా', 'తక్కువ ఆత్మవిశ్వాసం గలవారు' , ' చేతకాని వాళ్లుగా 'గా పేర్కొన్నారు. 

మూడో దశలో, ప్రజలను మేనేజర్లుగా చేసి, వారు కొత్త ఉద్యోగులను నియమించాల్సిన పరిస్థితిని కల్పించారు. AI టూల్స్‌ని ఉపయోగిస్తానని చెప్పిన వారిని నియమించే అవకాశం తక్కువగా ఉంది. కానీ మేనేజర్ స్వయంగా AI వినియోగదారు అయితే, అభ్యర్థి AIని ఉపయోగిస్తున్నాడా లేదా అనే దానితో సంబంధం లేదు.

నాలుగో,  చివరి ప్రయోగంలో, AI టూల్ పనికి అనుకూలంగా ఉంటే, పనితీరుపై సానుకూల ప్రభావం చూపితే, ప్రతికూల ఆలోచనలు దాదాపుగా పట్టించుకోని పరిస్థితిని చూశారు.  

AIని ఉపయోగించడం అవసరమా?

ఈ అధ్యయనం ఆఫీసులో AIని ఉపయోగించడం మీ పనిని సులభతరం చేసినప్పటికీ, మిగతావారు మిమ్మల్ని ఎలా చూస్తారో దానివల్ల మీ కెరీర్‌పై ప్రభావం పడవచ్చని తెలియజేస్తుంది. సమాజం ఆలోచన మారే వరకు, AIని తెరిచి ఉపయోగించడం కొంత ప్రమాదకరం కావచ్చు. అయితే, నేటి మారుతున్న ప్రపంచాన్ని చూస్తే, AIని ఉపయోగించడం ప్రజల అవసరం అయింది.

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget