By: ABP Desam | Updated at : 04 Feb 2023 05:00 PM (IST)
Edited By: Arunmali
రెండు నెలల్లోనే 100 మిలియన్ యూజర్లు
ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, సాంకేతిక యుగంలో గేమ్ ఛేంజర్ అయిన చాట్‌జీపీటీ (ChatGPT) అరుదైన రికార్డ్ సృష్టించింది. టెక్ దిగ్గజాలు రెండేళ్లు కష్టపడి సాధించిన ఘనతను, ఈ కొత్త తరం చాట్‌బాట్ కేవలం రెండు నెలల్లోనే సాధించింది.
చాట్‌జీపీటీ సాధించిన రికార్డ్ ఏంటంటే.. 2022 నవంబర్ చివరిలో ప్రారంభమై, ఈ రెండు నెలల్లోనే 100 మిలియన్ల వినియోగదారులను (100 million users) ఇది చేరుకుంది. ఒక్క జనవరి నెలలోనే రోజుకు 13 మిలియన్ల మంది యూజర్లను చాట్‌జీపీటీ సంపాదించుకుంది.
డేటా కంపెనీ సిమిలర్‌వెబ్ (Similarweb) సమాచారం ప్రకారం, జనవరి నెలలో, మొత్తం 100 మిలియన్ల మంది 590 మిలియన్ల సార్లు చాట్‌జీపీటీతో టచ్‌లోకి వచ్చారు. ఒక కన్జ్యూమర్ యాప్‌నకు ఈ స్థాయి వృద్ధి తారాస్థాయి లాంటిదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ UBS ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. "ఇంటర్నెట్ స్పేస్ వేగవంతం అయిన ఈ 20 సంవత్సరాల్లో, ఏ కన్జ్యూమర్ ఇంటర్నెట్ యాప్ కూడా ఇత వేగంగా వృద్ధి చెందలేదు" అని UBS విశ్లేషకులు రిపోర్ట్ రిలీజ్ చేశారు.
గతంలో, వేగంగా 100 మిలియన్ల యూజర్లను సంపాదించిన ఘతన టిక్‌టాక్‌కు (TikTok) ఉంది. టిక్‌టాక్ గ్లోబల్ లాంచ్ అయిన తొమ్మిది నెలల తర్వాత 100 మిలియన్ల వినియోగదారులను చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌కు (Instagram) ఈ మైల్‌స్టోన్ చేరడానికి రెండేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది.
చాట్‌జీపీటీ గురించి తెలుసుకోవడానికి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ తెలివితేటల్ని పరీక్షించడానికి, సమాచారాన్ని సేకరించడానికి.. ఇలా రకరకాల కారణాలతో, గత వారం రోజులుగా chat.openai.com వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నారట. దీంతో, ఈ వెబ్‌సైట్‌కు రోజుకు దాదాపు 25 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. జనవరి 31న చాట్‌జీపీటీని రికార్డు స్థాయిలో యూజర్లు వినియోగించారట. మిగిలిన రోజుల్లో, రోజుకు సగటున 15.7 మిలియన్ల మంది ఈ ఇంటర్నెట్ యాప్‌ను ఉపయోగిస్తే.. జనవరి 31న ఆ సంఖ్య 28 మిలియన్లకు చేరిందని తన రిపోర్ట్‌లో సిమిలర్‌వెబ్ వెల్లడించింది.
చాట్‌జీపీటీ ఏం చేస్తుంది?
చాట్‌జీపీటీ ఒక ఆర్టిఫిషియల్ వ్యక్తి లాంటిది. ఇంటర్నెట్ ద్వారా చాలా పనులు చేస్తుంది. మీరు ఇచ్చే టెక్ట్స్ ప్రాంప్ట్‌లకు ప్రతిస్పందనగా కథనాలు, వ్యాసాలు, జోకులు, కవిత్వం, జాబ్ అప్లికేషన్‌లను రూపొందించగలదు. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ కంపెనీ ఓపెన్‌ఏఐ (OpenAI) చాట్‌జీపీటీని రూపొందించింది, 2022 నవంబర్ చివరి వారంలో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజ్ జనరేటర్ Dall-Eని కూడా OpenAI అభివృద్ధి చేసింది.
గురువారం (02 ఫిబ్రవరి 2023) నాడు, చాట్‌జీపీటీ కోసం 20 డాలర్ల నెలవారీ సభ్యత్వాన్ని OpenAI ప్రకటించింది. ప్రస్తుతానికి, యునైటెడ్ స్టేట్స్‌లోని వినియోగదారులకు మాత్రమే ఈ మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించింది. మిగిలిన వారికి మాత్రం ఉచితం. కాకపోతే, 20 డాలర్ల మంత్లీ సబ్‌స్క్రిప్షన్ వల్ల మరింత స్థిరంగా, వేగవంతమైన సేవలను చాట్‌జీపీటీ ద్వారా అందుకోవచ్చు. దీంతోపాటు, కొత్త ఫీచర్లను ముందుగా ప్రయత్నించే అవకాశం కూడా నెలవారీ చందాదార్లకు అందుబాటులోకి వస్తుంది.
ChatGPT యొక్క వైరల్ లాంచ్ OpenAIకి ఇతర AI కంపెనీలకు వ్యతిరేకంగా మొదటి-మూవర్ ప్రయోజనాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న వినియోగం, OpenAIపై గణనీయమైన కంప్యూటింగ్ ఖర్చులను విధిస్తూ, చాట్‌బాట్ ప్రతిస్పందనలకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడటానికి విలువైన అభిప్రాయాన్ని కూడా అందించింది.
శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా OpenAI పని చేస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయం తమ ఖర్చులను కవర్ చేయడానికి సహాయపడుతుందని పేర్కొంది.
చాట్‌జీపీటీ దెబ్బకు గూగుల్ కూడా బెదిరింది. చాట్‌జీపీటీ పూర్తి స్థాయిలో ప్రపంచ ప్రజల్లోకి వెళితే, గూగుల్ కనుమరుగవుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ విపత్కర పోటీని ఎదుర్కోవడానికి గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. చాట్‌జీపీటీ తరహా సేవలను త్వరలోనే గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో పరిచయం చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) కొన్ని రోజుల క్రితం చెప్పారు. తాము కూడా సొంతంగా చాట్‌జీపీటీ తరహా సర్వీసును అభివృద్ధి చేయబోతున్నట్లు చైనాకు చెందిన బైడూ కూడా ప్రకటించింది.
Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్’ క్లోజ్ ?
Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!
Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు
PAN- Aadhaar Link: పాన్-ఆధార్ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా