BSNL New Plan: రూ.87కే బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ - రోజూ డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ కూడా - ప్లాన్ లాభాలు ఇవే!
కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ మనదేశంలో లాంచ్ చేసింది.
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మనదేశంలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఇది రూ.87 ప్రీపెయిడ్ ప్లాన్. దీని వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1 జీబీ హై స్పీడ్ డైలీ డేటాను అందించనున్నారు. అంటే మొత్తంగా 14 జీబీ డేటా లభించనుందన్న మాట.
ఈ డేటా అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. ఈ ప్లాన్ ప్రస్తుతం మనదేశంలో అన్ని సర్కిళ్లలో అందుబాటులోకి వచ్చింది. టెలికాం టాక్ కథనం ప్రకారం చత్తీస్‌ఘర్, అస్సాంల్లో మాత్రం ఈ ప్లాన్ లాంచ్ కాలేదు.
కేవలం డేటా మాత్రమే కాకుండా... రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా లభించనున్నాయి. దీంతోపాటు వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అందించే హార్డీ గేమ్స్ మొబైల్ సర్వీస్ కూడా లభించనుంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో బీఎస్ఎన్ఎల్ తన కొత్త రూ.797 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. దీని వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. 60 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్ (ప్రతి రోజూ) లభించనున్నాయి. 2 జీబీ డైలీ డేటా అయిపోయాక నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గిపోయింది.
అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా లభించే 60 రోజుల తర్వాత సిమ్ కార్డు యాక్టివ్‌గానే ఉండనుంది. దాని తర్వాత డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ కోసం ప్రత్యేకంగా టాప్-అప్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
View this post on Instagram