BSNL Best Prepaid Plan: 210 జీబీ డేటా, 105 డేస్ వ్యాలిడిటీ - తక్కువ ధరకే బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్!
Jio Vs BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వద్ద ప్రస్తుతం చాలా మంచి ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL Rs 666 Recharge Plan: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) రీఛార్జ్ ప్లాన్‌లు చాలా ఖరీదైనవిగా మారాయి. అటువంటి పరిస్థితిలో చాలా మంది వినియోగదారులు చవకైన ఆప్షన్ల కోసం చూస్తున్నారు. వినియోగదారుల సమస్యకు బీఎస్‌ఎన్‌ఎల్ ఓ పరిష్కారాన్ని అందిస్తోంది. వాస్తవానికి దేశంలోని ప్రభుత్వ టెలికాం కంపెనీ ఇప్పటికీ మంచి ప్లాన్‌లను తక్కువ ధరలకు అందిస్తోంది.
ఇవి లాంగ్ వ్యాలిడిటీ, పుష్కలంగా డేటా, అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. ఇప్పుడు మనం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అందిస్తున్న కూల్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇందులో ప్లాన్ వాలిడిటీ వరకు వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటాను పొందుతారు. అలాగే రోజువారీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత, ఇంటర్నెట్‌ను 40 కేబీపీఎస్ వేగంతో ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ కింద ప్రతిరోజూ 100 మెసేజ్‌లు కూడా లభిస్తాయి.
బీఎస్ఎన్ఎల్ రూ.666 ప్లాన్ లాభాలు ఇవే...
గత కొన్ని నెలల్లో లక్షల మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్‌కి మారారు. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) రీఛార్జ్ ప్లాన్‌ల ధర పెరుగుతున్న కారణంగా వినియోగదారులు ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నారు. కంపెనీ ఇప్పుడు రూ. 666కే చాలా మంచి ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 105 రోజుల లాంగ్ వ్యాలిడిటీని అందిస్తుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
105 రోజుల వ్యాలిడిటీ
రూ. 666 ధరకే వస్తున్న ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 105 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ 105 రోజుల పాటు రీఛార్జ్ టెన్షన్ నుంచి విముక్తిని అందిస్తుంది. ఇది ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాల్సిన ఇబ్బందుల నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది.
అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా...
ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులో యూజర్లు 105 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ ప్లాన్ ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రయోజనాన్ని అందిస్తుంది. అంటే ప్లాన్ వాలిడిటీ ఉన్నంత వరకు వినియోగదారులకు 210 జీబీ డేటా లభిస్తుందన్న మాట. రోజువారీ లిమిట్ ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. ఈ ప్లాన్ కింద ప్రతిరోజూ 100 మెసేజ్‌లు పంపే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?x
#BSNL is powering the future as the ✨India Connect Partner✨ at #IMC2024!
— BSNL India (@BSNLCorporate) October 14, 2024
Join us at Hall 4, Booth 4.46B.
🗓 15 - 18 October 2024
📍 Bharat Mandapam
👉 Register Now: https://t.co/PnduDJsoxN#BSNLAtIMC #TheFutureIsNow pic.twitter.com/J5GHmuTpSI
#FestiveBonanzaAlert 📢
— BSNL India (@BSNLCorporate) October 9, 2024
This festive season enjoy our Fibre Basic Plan at just ₹399/month, down from ₹499! Plus, get your first month FREE! Limited time offer. T&C apply.
Say ‘Hi’ on WhatsApp at 1800-4444 for more details!#BharatFibre #BSNLFTTH #BSNL #Switch_To_BSNL pic.twitter.com/PLdFxJUc4n