Apple Back to University 2023: స్టూడెంట్స్‌కు యాపిల్ గుడ్ న్యూస్ - బ్యాక్ టు యూనివర్సిటీ సేల్ - ఏకంగా రూ.20 వేల వరకు!
యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం యాపిల్ ‘బ్యాక్ టు యూనివర్సిటీ 2023’ సేల్‌ను ప్రారంభించనుంది.
Back to University 2023: భారతదేశంలో యూనివర్సిటీ స్టూడెంట్స్‌కు యాపిల్ ఒక ప్రమోషనల్ డీల్‌ను అందిస్తుంది. ‘బ్యాక్ టు యూనివర్సిటీ 2023’ అనే పేరుతో జరుగుతున్న ఈ క్యాంపెయిన్‌లో యాపిల్ ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లపై భారీ డిస్కౌంట్ అందించనున్నారు. ఐప్యాడ్ ప్రో 11 అంగుళాలు, 12.9 అంగుళాలు, ఐమ్యాక్ 24 అంగుళాల మోడల్స్‌ను తక్కువ రేట్లకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో తన ఉత్పత్తులపై యాపిల్ ఉచితంగా ఎయిర్‌పోడ్స్, ఇతర ఉత్పత్తులను కూడా అందిస్తుంది. దీంతోపాటు యాపిల్ కేర్ ప్లస్ ప్లాన్లపై 20 శాతం తగ్గింపు కూడా లభించనుంది. ఈ ఆఫర్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండిట్లోనూ అందుబాటులో ఉండనుంది.
బ్యాక్ టు యూనివర్సిటీ సేల్ కింద యాపిల్ ఉత్పత్తులను స్టూడెంట్లతో పాటు టీచర్లు, స్టాఫ్ కూడా కొనుగోలు చేయవచ్చు. జూన్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు యాపిల్ బీకేసీ, యాపిల్ సాకేత్, యాపిల్ ఆన్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
ఐప్యాడ్ ప్రో 11 అంగుళాల మోడల్ ధర రూ.96,900 కాగా, ఈ సేల్‌లో రూ.76,900కే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాల మోడల్ ధర రూ.1,12,900 నుంచి రూ.1,02,900 నుంచి తగ్గింది. ఐప్యాడ్ ఎయిర్ ధరను రూ.59,900 నుంచి రూ.54,900కు తగ్గించారు. ఈ మూడు ఐప్యాడ్ మోడల్స్‌తో యాపిల్ పెన్సిల్‌ను ఉచితంగా అందించనున్నారు.
మ్యాక్‌బుక్ ఎయిర్ 13 అంగుళాల స్క్రీన్ (ఎం1 చిప్) మోడల్ ధర రూ.99,900 నుంచి రూ.89,900కు తగ్గించారు. అలాగే మ్యాక్‌బుక్ ఎయిర్ 13 అంగుళాల స్క్రీన్ (ఎం2 చిప్) మోడల్ ధర రూ.1,29,900 నుంచి రూ.1,04,900కు తగ్గింది. మ్యాక్‌బుక్ ఎయిర్ 15 అంగుళాల స్క్రీన్ (ఎం1 చిప్) మోడల్ ధర రూ.1,34,900 నుంచి రూ.1,24,900కు తగ్గించారు.
మ్యాక్‌బుక్ ప్రో 13 అంగుళాల మోడల్ ధరను యాపిల్ ఎడ్యుకేషన్ ద్వారా అసలు ధర రూ.1,29,900కు కాకుండా, రూ.1,19,900కు కొనుగోలు చేయవచ్చు. మ్యాక్‌బుక్ ప్రో 14 అంగుళాల మోడల్ రూ.1,99,900కు లాంచ్ కాగా ఇప్పుడు దాని ధర రూ.1,84,900కు తగ్గనుంది. ఇక 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ.2,49,900 నుంచి రూ.2,29,900కు తగ్గించనున్నారు.
దీంతోపాటు ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌లపై కూడా భారీ ఆఫర్లు అందించనున్నారు. యాపిల్ కేర్ ప్లస్ ప్లాన్లపై 20 శాతం తగ్గింపు లభించనుంది. దీంతోపాటు యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్లు మూడు నెలల పాటు ఉచితంగా లభించనున్నాయి. దీని తర్వాతి వీరికి ప్రత్యేకంగా నెలకు రూ.59 మాత్రమే నిర్ణయించారు. ఈ ఆఫర్లు కేవలం వెరిఫైడ్ బయ్యర్లకు మాత్రమే యూనివర్సిటీ విద్యార్థులు, టీచర్లు, స్టాఫ్ వారి అర్హతను వెరిఫై చేసుకుని ఈ ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు. డిస్కౌంట్ కొంచెం ఎక్కువగానే అందించారు కాబట్టిఈ సేల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.