(Source: ECI/ABP News/ABP Majha)
Amazon Prime Lite: రూ.999కే అమెజాన్ ప్రైమ్ కొత్త ప్లాన్ - ఇందులో ఏం ఉంటాయంటే?
అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను రూ.999గా నిర్ణయించారు.
అమెజాన్ ప్రైమ్ లైట్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ ప్రైమ్ లైట్ కంటే ఇది కొంచెం చవకైన ప్లాన్. ఈ ప్లాన్ కొంత మందికి ఇక్కడికే ప్రారంభం అయింది. ఇది ఇప్పటికే కొంతమంది యూజర్లకు రోల్ అవుట్ అయింది. దీని ద్వారా వినియోగదారులకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా రెండు రోజుల పాటు ఉచితంగా డెలివరీలు లభించనున్నాయి. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కంటెంట్ ఉచితంగా లభించనుంది. అయితే అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ వంటి ఆప్షన్లు లభించబోవడం లేదు.
అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ధర
అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ధర సంవత్సరానికి రూ.999గా నిర్ణయించారు. అమెజాన్ ప్రైమ్ రెగ్యులర్ ప్లాన్ ధర రూ.1,499గా ఉంది. ఒరిజినల్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు ఇది కొంచెం టోన్డ్ డౌన్ వెర్షన్ అని తెలుస్తుంది. ఫ్రీ డెలివరీ, ప్రైమ్ సేల్స్‌కు ఎర్లీ యాక్సెస్, అమెజాన్ ప్రైమ్ వీడియోకు యాక్సెస్ వంటివి దీని ద్వారా లభించనున్నాయి.
అమెజాన్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ యాప్‌ల ద్వారా ఈ లైట్ ప్లాన్ తీసుకోవచ్చు. దీంతోపాటు ప్రస్తుతం మీ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ నుంచి చవకైన ప్రైమ్ లైట్ ప్లాన్‌కు కూడా షిఫ్ట్ కావచ్చు.
అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ లాభాలు
మరింత తక్కువ ఖర్చులో అమెజాన్ ప్రైమ్ లాభాలు పొందాలనుకునేవారికి ఇది చక్కటి ప్లాన్. ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌తో మీరు రెండు రోజుల్లో ఉచిత డెలివరీని పొందవచ్చు. అది కూడా ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండానే. రెగ్యులర్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వన్ డే డెలివరీ, సేమ్ డే డెలివరీ ఆప్షన్లు లభించనున్నాయి. లైట్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఈ సౌకర్యాలు అందుకోవాలంటే రూ.175 ఉచితంగా చెల్లించాలి.
దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం చవకైన ప్రైమ్ లైట్ ప్లాన్‌ను కూడా ఆఫర్ చేయనుంది. అయితే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. కేవలం రెండు డివైస్‌ల్లో మాత్రమే కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. దీంతోపాటు కేవలం హెచ్‌డీ రిజల్యూషన్‌లో మాత్రమే కంటెంట్ ఎంజాయ్ చేయవచ్చు.
ప్రైమ్ లైట్ ప్లాన్ ఉపయోగిస్తే... అమెజాన్ ప్రైమ్ వీడియోలో కంటెంట్ యాక్సెస్ చేసేటప్పుడు యాడ్స్ చూడాల్సి వస్తుంది. అయితే ఎంత సేపు యాడ్స్ వస్తాయి అనేది అమెజాన్ ఇంకా ప్రకటించలేదు. అలాగే వెబ్ బ్రౌజర్‌లో అమెజాన్ ప్రైమ్ కంటెంట్ యాక్సెస్ చేయలేరు. కేవలం ఐవోఎస్, ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది.
Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ వంటి లాభాలు ఈ ప్లాన్‌తో లభించవు. ఒకవేళ అమెజాన్ ప్రైమ్ రెండు రోజుల షిప్పింగ్, యాడ్స్‌తో అమెజాన్ ప్రైమ్ కంటెంట్ చూడాలి అనుకుంటే మీరు అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
Read Also: షావోమీ నుంచి కొత్త టాబ్లెట్ విడుదల, బడ్జెట్ ధరలో హైఎండ్ ఫీచర్స్
Amazon Prime Lite officially unveiled. ₹999 a year.#Amazon #AmazonPrimeLite pic.twitter.com/fAFZbhDMfH
— Mukul Sharma (@stufflistings) June 14, 2023