By: ABP Desam | Updated at : 27 Jan 2023 05:34 PM (IST)
టెక్నో ఫాంటం ఎక్స్2
Amazon Deal On Phone: రూ.50 వేల రేంజ్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని మీరు అనుకుంటే, కొత్తగా లాంచ్ అయిన Tecno Phantom X2 ఫోన్ డీల్‌ను చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఫోన్ చాలా మంచి కెమెరాను కలిగి ఉంది. ఇతర ఫోన్‌ల కంటే RAM కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఈ ఫోన్ సూపర్‌ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఫోన్ కొనుగోలుపై ఒక సంవత్సరం ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా ఉచితంగా లభిస్తుంది.
టెక్నో తన ఫాంటం ఎక్స్ సిరీస్‌లో కొత్త ఫోన్ అయిన దీన్ని ఇటీవలే మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.61,999 కాగా, అమెజాన్ సేల్‌లో రూ.49,999కే అందుబాటులో ఉంది. మూన్ లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
టెక్నో ఫాంటం ఎక్స్2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.8 అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. టెక్నో ఫాంటం ఎక్స్2 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్స్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ఈ మొబైల్ స్క్రీన్‌కు ప్రొటెక్షన్ లభించనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 5జీ ప్రాసెసర్‌పై టెక్నో ఫాంటం ఎక్స్2 పని చేయనుంది.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో అందించారు. మరో 5 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ను స్టోరేజ్ ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. వేపర్ చాంజర్ కూలింగ్ సిస్టంతో పాటు సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... టెక్నో ఫాంటం ఎక్స్2 వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్, 2 మెగాపిక్సెల్ సెన్సార్‌లను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
అలాగే ఐకూ 11 5జీపై కూడా మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.61,999 కాగా మూడు శాతం తగ్గింపుతో రూ.59,999కే అందుబాటులో ఉంది. దీంతోపాటు రూ.5,000 క్యాష్ బ్యాక్, రూ.18,200 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 2కే ఈ6 అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!
Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్ గురించి కాస్త తెలుసుకోండి!
Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్’ క్లోజ్ ?
Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!