అన్వేషించండి

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు

AI Abuse Prevention: ఏఐ చాట్‌బాట్ వేధించడం, క్లాడ్ ఏఐని దుర్వినియోగం చేయడాన్ని కంట్రోల్ చేయడానికి ఆంథ్రోపిక్ కొన్ని రూల్స్ తెచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంథ్రోపిక్ క్లాడ్‌ను దుర్వినియోగం చేయకుండా కొత్త నియమాలు.
  • ఉద్దేశపూర్వక వేధింపులు నిషేధం; ప్రశ్నించడం, సవాల్ చేయడం కాదు.
  • ఎన్నికలు, ఆయుధాలకు క్లాడ్ వాడకంపై పూర్తి నిషేధం విధించారు.
  • నిఘా, రోబోటిక్స్‌లో మానవ పర్యవేక్షణ, నియంత్రణ తప్పనిసరి.

 AI Abuse Prevention: ఏఐ చాట్‌బాట్‌ను కష్టమైన ప్రశ్నలు అడగడం, దాని సమాధానాలను సవాల్ చేయడం, ఒక అంశంపై పదేపదే డేటా అడగడం సాధారణంగా అందరూ చేసే పనే. కానీ, ఒక ఏఐని వేధించడాన్ని నిషేధించవచ్చా? ఏఐ దిగ్గజ సంస్థ 'ఆంథ్రోపిక్' తీసుకువచ్చిన ఒక కొత్త విధానం ఇప్పుడు ఈ ప్రశ్నను సమాధానం చెప్తుంది. తమ పాపులర్ ఏఐ మోడల్ 'క్లాడ్' దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆ సంస్థ కొన్ని కఠిన రూల్స్ అమలులోకి తెచ్చింది.

ఆంథ్రోపిక్ కొత్త నియమాలు ఏమిటి?

కొత్త నిబంధనల ప్రకారం.. ఎలాంటి సబబు అయిన కారణం లేకుండా ఎవరైనా వినియోగదారుడు క్లాడ్‌ను పదేపదే ఇబ్బంది పెట్టినా, దుర్వినియోగం చేసినా అది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. అయితే, ఏఐ ఇచ్చే సమాధానాలపై కోపం వ్యక్తం చేయడం, దానితో విభేదించడం, చీకటి థీమ్‌లపై ఫిక్షనల్ కథలు రాయడం లేదా దాని సామర్థ్యాలను పరీక్షించడానికి క్లిష్టమైన ప్రశ్నలు అడగడం వంటి సాధారణ చర్యలు ఈ నిబంధన పరిధిలోకి రావు. కేవలం ఉద్దేశపూర్వకంగా వేధించే ధోరణిని మాత్రమే ఇది అడ్డుకుంటుంది.

సంభాషణను స్టాప్ చేస్తుంది 'క్లాడ్'

పదేపదే దురుసుగా లేదా అసమంజసంగా ప్రవర్తించే యూజర్లతో చాట్ మధ్యలోనే ఆపేందుకు వీలుగా 'క్లాడ్'కు ప్రత్యేక ఫీచర్‌ను ఆంథ్రోపిక్ ఇదివరకే పరిచయం చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం Claude.ai, Claude Code లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికైతే అలాంటి సందర్భాల్లో చాట్‌ను ఆపేయడమే ప్రధానంగా ఉన్నప్పటికీ, నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారి అకౌంట్లను శాశ్వతంగా బ్యాన్ చేసేందుకు ఆ సంస్థ త్వరలో స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

ఆయుధాలు, ఎన్నికలలో ఏఐ పూర్తి నిషేధం

ఎన్నికలు, ఆయుధాలకు సంబంధించిన వాటిల్లో క్లాడ్ వినియోగాన్ని ఆంథ్రోపిక్ మరింత కఠినతరం చేసింది. ఫేక్ అకౌంట్లు సృష్టించడం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేయడం, రాజకీయ ప్రచారాలలో ప్రజలను తప్పుదారి పట్టించడం లేదా ఓటింగ్ గురించి అబద్ధాలు ప్రచారం చేయడం వంటి వాటికి ఏఐని వాడటం పూర్తిగా చట్టవిరుద్ధం.

ఆయుధాలకు సంబంధిత టెక్నాలజీని అభివృద్ధి చేయడం, డ్రోన్‌లకు ఆయుధాలను అమర్చడం, ఏఏఐతో పనిచేసే యంత్రాలను యుద్ధ కార్యకలాపాలు వాడడం వంటి వాటికి క్లాడ్‌ను ఉపయోగించడంపై కఠిన నిబంధనలు తెచ్చింది. 

Also Read:పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

నిఘా, రోబోటిక్స్‌లో మానవ నియంత్రణ  

క్లాడ్ వినియోగంపై నిఘా, రోబోటిక్స్ రంగాలకు సంబంధించి కొన్ని కఠిన మార్గదర్శకాలను కూడా రూపొందించారు. ఎవరి అనుమతీ లేకుండా వారిని రహస్యంగా పర్యవేక్షించడానికి, పాత డేటా ఆధారంగా వారి కదలికలను ట్రాక్ చేయడానికి లేదా నిఘా వ్యవస్థలను డిజైన్ చేయడానికి క్లాడ్‌ను ఉపయోగించడాన్ని నిషేధించింది. అంతేకాకుండా, మనుషులకు గాయం చేసే రోబోట్ లేదా యంత్రానికి క్లాడ్‌ను అనుసంధానించినట్లయితే.. ఆ యంత్రాన్ని పర్యవేక్షించడానికి, ఏ ప్రమాదమైనా తలెత్తితే తక్షణమే దానిని ఆపేయడానికి శిక్షణ పొందిన వారు కచ్చితంగా అక్కడ అందుబాటులో ఉండాలని నిబంధన తెచ్చింది.  

Also Read: స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే

Frequently Asked Questions

ఆంథ్రోపిక్ కొత్త విధానం దేని గురించి?

ఆంథ్రోపిక్ సంస్థ తమ ఏఐ మోడల్ 'క్లాడ్' దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొన్ని కఠిన నియమాలను అమలులోకి తెచ్చింది. వినియోగదారులు ఉద్దేశపూర్వకంగా క్లాడ్‌ను వేధించడాన్ని ఇది నిషేధిస్తుంది.

కొత్త నియమాల ప్రకారం ఎలాంటి చర్యలు ఉల్లంఘన కిందకు వస్తాయి?

సబబు అయిన కారణం లేకుండా క్లాడ్‌ను పదేపదే ఇబ్బంది పెట్టడం, దుర్వినియోగం చేయడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఏఐ సమాధానాలపై కోపం వ్యక్తం చేయడం వంటి సాధారణ చర్యలు దీని పరిధిలోకి రావు.

నిబంధనల ఉల్లంఘనలను క్లాడ్ ఎలా పరిష్కరిస్తుంది?

పదేపదే దురుసుగా ప్రవర్తించే యూజర్లతో క్లాడ్ చాట్‌ను మధ్యలోనే ఆపేస్తుంది. భవిష్యత్తులో నిబంధనలు ఉల్లంఘించే వారి అకౌంట్లను శాశ్వతంగా బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంది.

ఎన్నికలు, ఆయుధాలకు సంబంధించి ఏఐ వినియోగంపై ఆంక్షలు ఏమిటి?

ఎన్నికలలో తప్పుడు కంటెంట్ ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించడం, అలాగే ఆయుధ సంబంధిత సాంకేతికతను అభివృద్ధి చేయడానికి క్లాడ్‌ను ఉపయోగించడం పూర్తిగా నిషేధం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Embed widget