అన్వేషించండి

Chess Player Gukesh: ఓటమి నుంచే గెలిచే శక్తి - చెస్ సంచలనం గుకేశ్ విజయ రహస్యం

Candidates Chess 2024: భారత యువ సంచలనం, ఫిడే క్యాండిడేట్స్ టైటిల్ విజేత గుకేశ్​ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడి విజయాన్ని అభినందిస్తూ ప్రధాని మోదీ సైతం శుభాకాంక్షలు తెలిపారు.

D Gukesh  interview:  విజయం వ్యక్తికి  ప్రేరణను ఇస్తుంది. తాజాగా జరిగిన  ఫిడే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ(D Gukesh  interview)లో టైటిల్‌ నెగ్గి  చరిత్ర సృష్టించిన భారత యువ సంచలనం గుకేశ్‌కు మాత్రం  ఓ ఓటమి ప్రేరణగా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా గుకేశ్‌ వెల్లడించాడు.  ఈ సందర్భంగా ఇరాన్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ఫిరౌజ్జా అలిరెజాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు  తెలిపాడు. ఈ టోర్నీలో ఏడో రౌండ్‌లో అలిరెజా చేతిలో గుకేశ్‌ ఓడిపోయాడు. ఈ ఓటమే తనను ఛాంపియన్‌గా అయ్యేందుకు శక్తిని అందించిందని గుకేశ్‌  తెలిపాడు. 
 
ఈ టోర్నీ ప్రారంభం నుంచి తాను చాలా సానుకూలంగా ముందుకు సాగినా  అలీరెజాపై ఏడో రౌండ్ ఓటమి తర్వాత తీవ్రంగా కలత చెందనన్నాడు . కానీ ఈ పరాజయమే తనకి శక్తిని, ప్రేరణను అందించిందన్నాడు. అంతే కాదు ఓడిపోయిన తర్వాత సరైన పనిని కొనసాగిస్తే, సరైన మానసిక స్థితిలో ఉంటే విజయం సాధించగలమని తను  నమ్మానన్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తనను అభినందించడం ఆనందంగా ఉందన్న గుకేశ్‌.. త్వరలోనే తనను కలుస్తానని అన్నాడు. తన తల్లిదండ్రులు  పట్టరాని సంతోషంగా ఉన్నారని  తెలిపాడు.  

13వ రౌండ్‌ నాటికి మొత్తం 8.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచిన అతడు.. అమెరికాకు చెందిన హికరు నకమురతో జరిగిన 14వ రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో అతడి ఖాతాలో 9 పాయింట్లు చేరాయి.  నెపోమ్నియాషి (రష్యా) - ఫాబియానో కరువానా (అమెరికా) మధ్య మ్యాచ్‌ కూడా డ్రా అయింది. వారిద్దరూ 8.5 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో భారత యువ చెస్‌ ప్లేయర్ గుకేశ్‌ టైటిల్‌ను సాధించాడు. ఈ విజయంతో ప్రపంచ చాంపియన్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన రెండో భారతీయుడిగా, మొదటి టీనేజర్‌గా గుకేశ్‌ నిలిచాడు.

చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఫిడే క్యాండిడేట్స్‌ టైటిల్‌ను నెగ్గిన రెండో భారత ఆటగాడిగా గుకేశ్‌ నిలిచాడు. క్లాసికల్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో చైనా గ్రాండ్‌ మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌తో తలపడనున్నాడు. అందులోనూ విజయం సాధిస్తే అతి పిన్న వయస్సులో ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. గతంలో మాగ్నస్ కార్ల్‌సన్, కాస్పరోవ్‌ 22 ఏళ్ల వయసులో ఛాంపియన్లుగా నిలిచారు. అంతకు ముందు ఈక్లాసికల్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ టోర్నికి భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ క్వాలిఫై అయ్యారు. 

అప్పుడు ఆనంద్- ఇప్పుడు గుకేశ్.. 
ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 2014లో ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టైటిల్ నెగ్గిన పదేళ్ల తరువాత గుకేశ్ అదే ఘనతను సాధించగలిగాడు. టాప్ సీడ్ ఫేబియానో కరూనా- రష్యన్ గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమినిచ్ ల ఆఖరి రౌండ్ గేమ్ డ్రాగా ముగియడం, నకామురాతో పోరును గుకేశ్ డ్రాగా ముగించడంతోనే ఫలితం తేలిపోయింది. 12 సంవత్సరాల చిరుప్రాయంలోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన చెన్నైకు చెందిన గుకేశ్ ప్రపంచ క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గడం ద్వారా ప్రపంచ రికార్డుతో సరికొత్త చరిత్ర సృష్టించడంతో పాటు..2025 ప్రపంచ చెస్ టైటిల్ గెలుచుకొనే అవకాశాన్ని సంపాదించాడు. గుకేశ్ సాధించిన ఈ ఆపురూప విజయం చూసి భారత చదరంగ అభిమానులు మురిసిపోతున్నారు. సందేశాలతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget