By: ABP Desam | Updated at : 04 Feb 2023 10:54 PM (IST)
మహిళల ఐపీఎల్ రూల్స్ కొత్తగా ఉండనున్నాయి.
WPL 2023 Final Equation: మహిళల IPL (WIPL) గురించి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. క్రమంగా ఈ టోర్నమెంట్ గురించిన వివరాలు వెల్లడి కానున్నాయి. మహిళల ఐపీఎల్ తొలి ఎడిషన్ 2023లోనే జరగనుంది. ఇప్పుడు ఈ తొలి సీజన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో జట్లు ఫైనల్స్‌కు చేరే రూట్‌ను తెలియజేశారు. మహిళల ఐపీఎల్‌లో ఫైనల్‌కు వెళ్లే దారి పురుషుల ఐపీఎల్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందులో నాలుగింటికి బదులు టాప్-3 జట్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరనున్నాయి.
ఫైనల్‌కు చేరుకోవడానికి ఇదే దారి
మీడియాలో వినిపిస్తున్న నివేదిక ప్రకారం, మహిళల ఐపీఎల్‌లో టాప్-3 జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో నంబర్ వన్ జట్టు ఎక్కువ లాభపడుతుంది. నంబర్ వన్ జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. దీని కోసం ఆ జట్టు ఎలాంటి క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. అయితే రెండు మరియు మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌కు చేరుకోవడానికి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. గెలిచిన జట్టు నంబర్ వన్ ర్యాంక్ జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.
పురుషుల ఐపీఎల్‌లో వేరే పద్ధతి
మరోవైపు పురుషుల ఐపీఎల్‌లో ఫైనల్స్‌కు వెళ్లే మార్గం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇందులో టాప్-4 జట్లు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఆడుతాయి. ఇందులో నంబర్ వన్, టూ స్థానాల్లో ఉన్న జట్లకు రెండుసార్లు ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌లో చోటు దక్కించుకోవడానికి రెండు మ్యాచ్‌లు ఆడాలి.
ఇందులో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది. అదే సమయంలో ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంది. దీని తరువాత ఎలిమినేటర్ మ్యాచ్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో ఫైనలిస్ట్ అవుతుంది.
అరంగేట్రం మహిళల ఐపీఎల్ (WPL)కు భారీ స్పందన లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అంతర్జాతీయ క్రికెటర్లు లీగు కోసం ఎదురు చూస్తున్నారు. వేలం కోసం ఇప్పటికే 1000 మంది వరకు అమ్మాయిలు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిసింది. ఈ జాబితాను బీసీసీఐ మరింత కుదించి ఫ్రాంచైజీలకు ఇవ్వనుంది.
విమెన్ ప్రీమియర్ లీగుకు ఏర్పాట్లనీ చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంచైజీల వేలం ముగిసింది. బీసీసీఐకి భారీగా డబ్బు సమకూరింది. ఇక ఫిబ్రవరి 13న క్రికెటర్ల వేలం నిర్వహించనుంది. ఇందుకోసం పేర్లు నమోదు చేసుకోవాలని ఆహ్వానించింది. ప్రకటన ఇచ్చిందో లేదో అమ్మాయిలు రిజిస్ట్రేషన్లకు ఎగబడ్డారు. వెయ్యి మందికి పైగా నమోదు చేసుకున్నారని వార్తలు. దాంతో ఈ జాబితాను 150కి కుదించాలని బోర్డు భావిస్తోంది.
CrickPe APP: 'ఫోన్‌పే' గురించి తెలుసు - ఈ 'క్రిక్‌పే' ఏంటి, ఎక్కడ్నుంచి వచ్చింది?
MIW Vs UPW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?
Suryakumar Yadav: సూర్యకుమార్ 3 వన్డేల్లో 3 డక్స్! మర్చిపోతే మంచిదన్న సన్నీ!
IPL 2023: రెస్ట్ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్!
‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
రేవంత్ హౌస్ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు
TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు
పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్