అన్వేషించండి

Wimbledon 2024 Winner: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా క్రెజికోవా, హిస్టరీ రిపీట్

Wimbledon 2024 Single Winner : వింబుల్డ్ మహిళల సింగిల్స్ లో హిస్టరీ రిపీట్ అయింది. ఈసారి కూడా కొత్త ఛాంపియన్ అవతరించింది. ఫైనల్లో జాస్మిన్ పై నెగ్గి వింబుల్డ్ సింగిల్స్ విజేతగా క్రెజికోవా నిలిచింది.

Wimbledon 2024 Womens Single Winner : మహిళల వింబుల్డన్​ గ్రాండ్ స్లామ్ లో కొత్త విజేత ఆవిర్భవించింది. వింబుల్డన్ 2024 మహిళల సింగిల్స్‌ కొత్త ఛాంపియన్‌గా చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి బార్బర క్రెజికోవా అవతరించింది. శనివారం (జూలై 13న ) జరిగిన సింగిల్స్  ఫైనల్లో ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలినిపై 6-2, 2-6, 6-4 తేడాతో గెలుపొందింది.
ఈ ఇద్దరికీ ఇదే తొలి వింబుల్డన్‌ ఫైనల్‌. కానీ ఒత్తిడిని జయిస్తూ క్రెజికోవా విజయం సాధించింది. తాజా విజయంతో క్రెజికోవా ఖాతాలో రెండో గ్రాండ్‌స్లామ్‌ చేరింది. మూడేళ్ల కిందట 2021లో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా  క్రెజికోవా నిలవడం తెలిసిందే. 

తొలి సెట్​ ను 6-2తో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ క్రెజికోవా నెగ్గింది. రెండో సెట్​లో ఇటలీ భామ జాస్మిన్ నుంచి క్రేజికోవాకు గట్టి పోటి ఎదురైంది. 2-6 తో జాస్మిన్ రెండో సెట్ కొట్టింది. ఇక కీలకమైన మూడో సెట్​లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. కానీ గతంలో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన అనుభవంతో జాస్మిన్ పై క్రెజికోవా పైచేయి సాధిస్తూ సెట్  నెగ్గడంతో వింబుల్డన్ సింగిల్స్ ఛాంపియ‌న్‌గా చ‌రిత్ర సృష్టించింది. ఈ గ్రాండ్ స్లామ్ ట్రోఫీతో ఏకంగా రూ.28.5 కోట్ల ప్రైజ్‌మ‌నీని చెక్ రిపబ్లిక్ భామ క్రెజికోవా సొంతం చేసుకుంది.

గత 8 ఏళ్లుగా వింబుల్డన్ లో సరికొత్త విజేతలు అవతరిస్తున్నారు. చివరగా అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గింది.  2016లో సెరెనా నెగ్గిన తరువాత జరిగిన ప్రతి వింబుల్డన్‌లోనూ మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త ఛాంపియన్స్​ ఆవిర్భావిస్తున్నారు. ఈ ఏడాది సైతం తొలిసారి ఫైనల్ చేరిన ఇద్దరు తలపడటంతో కొత్త చాంపియన్ అవతరించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఆ పత్రం చూపిస్తే కొత్త రేషన్ కార్డ్
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఆ పత్రం చూపిస్తే కొత్త రేషన్ కార్డ్
Hindenburg Research: హిండెన్‌బర్గ్ మరో నివేదిక, సెబీ ఛైర్ పర్సన్ మాధవి బుచ్‌‌పై సంచలన ఆరోపణలు
హిండెన్‌బర్గ్ మరో నివేదిక, సెబీ ఛైర్ పర్సన్ మాధవి బుచ్‌‌పై సంచలన ఆరోపణలు
Duvvada Family Issue :  దువ్వాడ ఫ్యామిలీ సర్కస్‌లో డీఎన్‌ఏ టెస్టుల గోల  - మాధురీ, శ్రీవాణి పరస్పర డిమాండ్స్
దువ్వాడ ఫ్యామిలీ సర్కస్‌లో డీఎన్‌ఏ టెస్టుల గోల - మాధురీ, శ్రీవాణి పరస్పర డిమాండ్స్
Nagarjuna Akkineni: అందుకే హడావుడిగా నిశ్చితార్థం జరిపించాం - శోభిత వల్ల చై మళ్లీ సంతోషంగా కనిపించాడు..
అందుకే హడావుడిగా నిశ్చితార్థం జరిపించాం - శోభిత వల్ల చై మళ్లీ సంతోషంగా కనిపించాడు..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Wayanad Landslides | Farewell to Indian Army | వయనాడ్ లో సైనికులకు ఘన వీడ్కోలు | ABP DesamNeeraj Chopra Silver Medal in Paris Olympics 2024 | బంగారు పతకం రాకపోవడంపై నీరజ్ ఫస్ట్ రియాక్షన్ |Arshad Nadeem Gold Medal in Paris Olympics 2024 | మేస్త్రీ కొడుకు బంగారు పతకం సాధించాడు.!Neeraj Chopra Silver Medal in Paris Olympics 2024| Javelin throwలో వెండి పతకంతో సరిపెట్టుకున్న నీరజ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఆ పత్రం చూపిస్తే కొత్త రేషన్ కార్డ్
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఆ పత్రం చూపిస్తే కొత్త రేషన్ కార్డ్
Hindenburg Research: హిండెన్‌బర్గ్ మరో నివేదిక, సెబీ ఛైర్ పర్సన్ మాధవి బుచ్‌‌పై సంచలన ఆరోపణలు
హిండెన్‌బర్గ్ మరో నివేదిక, సెబీ ఛైర్ పర్సన్ మాధవి బుచ్‌‌పై సంచలన ఆరోపణలు
Duvvada Family Issue :  దువ్వాడ ఫ్యామిలీ సర్కస్‌లో డీఎన్‌ఏ టెస్టుల గోల  - మాధురీ, శ్రీవాణి పరస్పర డిమాండ్స్
దువ్వాడ ఫ్యామిలీ సర్కస్‌లో డీఎన్‌ఏ టెస్టుల గోల - మాధురీ, శ్రీవాణి పరస్పర డిమాండ్స్
Nagarjuna Akkineni: అందుకే హడావుడిగా నిశ్చితార్థం జరిపించాం - శోభిత వల్ల చై మళ్లీ సంతోషంగా కనిపించాడు..
అందుకే హడావుడిగా నిశ్చితార్థం జరిపించాం - శోభిత వల్ల చై మళ్లీ సంతోషంగా కనిపించాడు..
Pawan Kalyan: ఆగస్ట్ 15 సందర్భంగా పంచాయతీలకు భారీగా నిధులు, మంత్రి పవన్ కళ్యాణ్ సంచలనం
ఆగస్ట్ 15 సందర్భంగా పంచాయతీలకు భారీగా నిధులు, మంత్రి పవన్ కళ్యాణ్ సంచలనం
Chandrababu: తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు కీలక భేటీ, రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై స్పష్టత
తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు కీలక భేటీ, రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై స్పష్టత
Keerthy Suresh: ఫల్మ్‌ఫేర్‌ అవార్డుతో కీర్తి సురేష్ - దసరా టీంతో కలిసి ఫోటోలకు ఫోజులు
ఫల్మ్‌ఫేర్‌ అవార్డుతో కీర్తి సురేష్ - దసరా టీంతో కలిసి ఫోటోలకు ఫోజులు
Wayanad: కన్నీళ్లు పెట్టుకున్న వయనాడ్ బాధితులు, ఓదార్చిన ప్రధాని మోదీ - వీడియో
కన్నీళ్లు పెట్టుకున్న వయనాడ్ బాధితులు, ఓదార్చిన ప్రధాని మోదీ - వీడియో
Embed widget