అన్వేషించండి

T20 World Cup 2024: అమెరికా కొంపముంచిన పెనాల్టీ పరుగులు.. భారత్ విజయం 

Cricket News in Telugu: టి20 వరల్డ్ కప్ లో అమెరికాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు పోరాడి విజయం సాధించింది. పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు సమర్పించుకోవడం ద్వారా అమెరికా జట్టు నష్టపోయింది.

India vs USA Highlights: టి20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో భారత జట్టు విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో సూపర్-8 దశకు చేరుకున్న మూడో జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సూపర్ 8కు అర్హత సాధించాయి. అమెరికా జట్టు విధించిన స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు భారత జట్టు చెమటోడ్చాల్సి వచ్చింది. కొద్దిరోజుల కిందట జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుకు షాక్ ఇచ్చిన అమెరికా జట్టు చేసిన చిన్న తప్పిదం భారత్ కు వరంగా మారింది. కీలకమైన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 110 పరుగులు చేసింది. 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చేదనకు తీవ్రంగా ఇబ్బంది పడింది. తొలి నుంచి బౌలింగ్ అనుకూలిస్తున్న నసావు కౌంటి క్రికెట్ స్టేడియంలో పరుగులు చేయడానికి భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆమెరికా జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత 7.3 ఓవర్లలో 44 పరుగులు చేసి మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. ఈ దశలో భారత గట్టును సూర్య కుమార్ యాదవ్ (50 నాటౌట్), శివం దూబే (31 నాటౌట్) తుది వరకు క్రీజులో ఉండి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చారు. మరో పది బంతులు మిగిలి ఉండగానే మ్యాచును ముగించారు. 

ఊహించని మలుపుతో భారత్ కు అదనంగా ఐదు పురుగులు - 5 Penalty Runs 

భారత జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు నష్టపోయి 76 పరుగులు చేసింది. 30 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. అయితే సవాళ్లతో కూడిన నసావు కౌంటీ ట్రాక్ లో ఈ పరుగులు చేయడం కూడా భారత జట్టుకు కష్టంగా మారింది. అప్పటికే క్రీజులో ఉన్న ఆటగాళ్లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో మ్యాచ్ అనూహ్య మలుపు తిరిగింది. అమెరికా జట్టు మూడుసార్లు ఓవర్ల మధ్య ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో ఐదు పరుగులను పెనాల్టీగా విధించారు. దీంతో భారత జట్టు లక్ష్యం 30 బంతుల్లో 30 పరుగులకు తగ్గింది.  ఇది భారత జట్టు ఒత్తిడిని తగ్గించి జట్టు సునాయాస విజయాన్ని అందుకునేలా చేసింది. 

అందుకే ఐదు పరుగులు పెనాల్టీ..

కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం ఒక ఇన్నింగ్స్ లో మూడుసార్లు కొత్త ఓవర్ ప్రారంభించేందుకు 60 సెకండ్లకు మించి సమయం తీసుకుంటే పెనాల్టీ విధిస్తారు. అమెరికా జట్టు భారత్ తో ఆడిన మ్యాచ్ లో మూడుసార్లు ఓవర్ ప్రారంభించడానికి 60 సెకన్లకు మించి సమయాన్ని తీసుకుంది. నిర్ణీత గడువు లాగా అమెరికా జట్టు ఓవర్లను ప్రారంభించడంలో పదేపదే విఫలమవడంతో ఎంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత జట్టు మిగిలిన 30 పరుగులను మరో పది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. స్వల్ప స్కోరును ఛేదించే క్రమంలో ఇబ్బందులు పడుతున్న భారత జట్టుకు అదనంగా కలిసి వచ్చిన ఈ ఐదు పరుగులు అద్భుతమైన విజయాన్ని సాధించేలా చేశాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget