Sachin Centuries Record: సచిన్ సెంచరీల రికార్డు - ఎవరెంత దూరంలో ఉన్నారు? - ఎవరికి అవకాశం ఉంది?
సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు బద్దలు కొట్టే సత్తా ఎవరికి ఉంది?
Sachin Tendulkar Centuries Record: సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 100 సెంచరీలు సాధించాడు. 2019 సంవత్సరం ఈ రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యమని అందరూ భావించారు. అయితే ఆ సంవత్సరం విరాట్ కోహ్లీ తన 70వ అంతర్జాతీయ సెంచరీని సాధించినప్పుడు, క్రికెట్ నిపుణులు సచిన్ గొప్ప రికార్డును ప్రమాదంలో ఉందని గుర్తించారు. కానీ దీని తర్వాత, తరువాతి మూడేళ్లలో విరాట్ బ్యాట్ నుండి ఎటువంటి సెంచరీ రాలేదు. సచిన్ రికార్డును బద్దలు కొట్టడం మళ్లీ అసాధ్యమనే భావన మొదలైంది.
అయితే విరాట్ కోహ్లీ మరోసారి ఫాంలోకి రావడంతో ఈ ప్రశ్న మరోసారి తలెత్తుతోంది. ఆసియా కప్ 2022లో అతను మూడేళ్ల సెంచరీ కరువును ముగించాడు. గత నెలలో బంగ్లాదేశ్తో జరిగిన ODIలో మరో సెంచరీని సాధించాడు. సచిన్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టగల శక్తి తనకు ఇంకా ఉందని చూపించాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 72 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత యాక్టివ్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్ (45), జో రూట్ (44), స్టీవ్ స్మిత్. వీరు సచిన్ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యం. వాస్తవానికి ఈ క్రికెటర్లందరూ 33 సంవత్సరాల పైన వయస్సు గలవారు. గరిష్టంగా మూడు లేదా నాలుగు సంవత్సరాలు క్రికెట్ ఆడగలరు. సచిన్ గొప్ప రికార్డును బద్దలు కొట్టేందుకు ఈ ఆటగాళ్లకు ఈ సమయం సరిపోదు.
సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేయగలడా?
ప్రస్తుతం సచిన్ 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లి ఒక్కడే బద్దలు కొట్టగలడు. అయితే విరాట్ ఆ ఘనత సాధించగలడా? విరాట్ ప్రస్తుతం సచిన్ కంటే 28 సెంచరీలు వెనుకబడి ఉన్నాడు. అతడి వయసు 34 ఏళ్లు. ఇప్పుడు అతడికి టీ20 క్రికెట్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి భవిష్యత్ టీ20 జట్టులో విరాట్, రోహిత్ వంటి సీనియర్ ఆటగాళ్లను బీసీసీఐ చూడడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు, వన్డే క్రికెట్లో మెరుగ్గా ఆడటం ద్వారానే సచిన్ను విరాట్ దాటాల్సి ఉంటుంది.
అదేవిధంగా టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ కూడా అంతగా రాణించలేకపోయాడు. టెస్టుల్లో పరుగుల పరంగా, జో రూట్, స్టీవ్ స్మిత్ కంటే విరాట్ కోహ్లీ వెనుకబడి ఉన్నాడు. కేన్ విలియమ్సన్ కూడా అతనిని అధిగమించబోతున్నాడు. టెస్టుల్లో విరాట్ ఇప్పటివరకు 27 సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ చాలా తక్కువగా ఆడుతున్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ వరకు కచ్చితంగా మ్యాచ్ల సంఖ్య ఎక్కువగానే ఉండబోతుంది. కానీ ఆ తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్ల సంఖ్య తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సచిన్ రికార్డును విరాట్ బద్దలు కొట్టడం అసాధ్యమనిపిస్తోంది.
విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫాంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరంలో 11 సెంచరీలు చేశాడు. మళ్లీ అదే ఫాంలోకి వస్తే సచిన్ రికార్డు ధ్వంసమయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి సచిన్ సెంచరీల రికార్డు పూర్తిగా సేఫ్ అయినట్లే. ఒక సంవత్సరంలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా సచిన్ టెండూల్కర్ పేరు మీదే ఉంది. 1998లో సచిన్ ఏడాదిలో 12 సెంచరీలు సాధించాడు.