News
News
X

మిగతా టీమ్‌లు పాక్‌కు వచ్చినప్పుడు ఇండియా ఎందుకు భయపడుతోంది? -పీసీబీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Asia Cup Row: ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ వేదికగా జరగబోయే ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లబోమని తేల్చి చెప్పింది.

FOLLOW US: 
Share:

ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదంటే వెళ్లదని తెగేసి చెప్పినా గత కొంతకాలంగా  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడితో పాటు  మాజీ క్రికెటర్లు నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ  ఈ ఇష్యూను  నిత్యం రగుల్చుతూనే ఉన్నారు. తాజాగా పీసీబీ చీఫ్ నజమ్ సేథీ మరోసారి ఆసియా కప్ నిర్వహణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోని  అగ్రశ్రేణి జట్లు పాకిస్తాన్ కు వచ్చి క్రికెట్ ఆడుతుంటే.. భారత్‌కు మాత్రమే భద్రతా సమస్యలు ఎందుకు కనబడుతున్నాయని ప్రశ్నించాడు. 

భారత్‌కు ఎందుకంత భయం..?

ఆసియా కప్ నిర్వహణ వివాదం గురించి  సేథీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... ‘క్రికెట్ ఆడేందుకు మిగతా జట్లు  పాకిస్తాన్ కు వస్తున్నాయి.  వాళ్లు భద్రత గురించి ఏ కంప్లయింట్లూ చేయడం లేదు.  కానీ భారత్ మాత్రమే సెక్యూరిటీ రీజన్స్‌ను చూపుతున్నది..? ఇదే రీతిలో మేము కూడా  ఈ ఏడాది  వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు  భారత్‌కు వెళ్లబోమని చెప్పాం. వీటిని ఐసీసీ సమావేశం (ఈ నెల చివరి వారంలో జరుగనుంది) లో లేవనెత్తుతూ  

భారత్ వ్యవహరిస్తున్న వైఖరి (పాక్‌కు వెళ్లనని చెప్పడం)కి మేం  వ్యతిరేకం. ఎందుకంటే ఇదేదో ఒక్క ఆసియా కప్  కు సంబంధించిన విషయం కాదు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ తో పాటు 2025లో ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా  పాకిస్తాన్ లోనే జరుగనుంది. దానిని కూడా దృష్టిలో ఉంచుకుని చర్చలు జరపాలి..’ అని చెప్పాడు. అయితే భారత్.. ఆసియా కప్ ఆడేందుకు పాక్‌కు  రాకున్నా తాము వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు వెళ్లాలని తమ  ప్రభుత్వం చెబితే వెళ్లాల్సిందేనని సేథీ వివరించాడు. 

నేపథ్యమిది.. 

గతేడాది టీ20 ప్రపంచకప్ కు ముందు బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ కామెంట్స్  చేయడంతో వివాదం రేగింది. తటస్థ వేదిక అయితేనే తాము ఆసియా కప్ ఆడతామని, అలా కాకుండా పాకిస్తాన్ లో అయితే ఆడబోమని జై షా తేల్చి  చెప్పాడు.  దీంతో  పీసీబీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.  అలా అయితే తాము కూడా  వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియా  వెళ్లమని హెచ్చరించింది. దానికి కౌంటర్ గా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ..  ‘వచ్చేవాళ్లు వస్తారు. రాని వాళ్ల గురించి మేం  పట్టించుకోం..’ అని   కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 

నజమ్ సేథీ కూడా గత నెలలో బహ్రెయిన్ లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ఈ వివాదంపై  ఏదో ఒక పరిష్కారం దిశగా అడుగులు వేయాలని  సూచించాడు.  ఈ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు జై షా తో పాటు బీసీసీఐ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అప్పుడు కూడా బీసీసీఐ తన నిర్ణయాన్ని కరాఖండీగా చెప్పేసింది. భారత్.. పాక్ కు వెళ్లే విషయంలో కేంద్ర  ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది.  

Published at : 16 Mar 2023 04:26 PM (IST) Tags: BCCI PCB Indian Cricket Team Pakistan cricket board Jay Shah Ind vs Pak Asia Cup Najam Sethi 2023 ODI World Cup Asia Cup Row

సంబంధిత కథనాలు

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!

MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!

MIW Vs DCW: టేబుల్ టాప్ జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ!

MIW Vs DCW: టేబుల్ టాప్ జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ!

UPW-W vs GG-W, Match Highlights: హ్యారిస్‌.. హరికేన్‌ ఇన్నింగ్స్‌ - ఆఖరి లీగులో గుజరాత్‌కు తప్పని ఓటమి!

UPW-W vs GG-W, Match Highlights: హ్యారిస్‌.. హరికేన్‌ ఇన్నింగ్స్‌ - ఆఖరి లీగులో గుజరాత్‌కు తప్పని ఓటమి!

Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?

Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !