Carlos Brathwaite Daughter Name: తన బిడ్డకు 'ఈడెన్ గార్డెన్' పేరు పెట్టిన విండీస్ క్రికెటర్.. ఎందుకో తెలుసా!
కార్లోస్ బ్రాత్‌వైట్ భారత్‌పై ప్రేమ కురిపించాడు! తన కుమార్తెకు ఈడెన్ గార్డెన్ మైదానం పేరు కలిసొచ్చేలా పెట్టాడు. ఎందుకంటే ఆ మైదానంలో అతడో అద్భుతమైన ఘనత సాధించాడు.
వెస్టిండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్ భారత్‌పై ప్రేమ కురిపించాడు! తన కుమార్తెకు ఈడెన్ గార్డెన్ మైదానం పేరు కలిసొచ్చేలా పెట్టాడు. ఎందుకంటే ఆ మైదానంలో అతడో అద్భుతమైన ఘనత సాధించాడు. 2016లో విండీస్‌కు రెండోసారి టీ20 ప్రపంచకప్ అందించాడు.
'ఈ పేరు గుర్తుపెట్టుకోండి (REMEMBER THE NAME). ఈడెన్ రోజ్ బ్రాత్‌వైట్. 2-6-22న పుట్టింది. మేం నీ కోసమే ఎదురు చూస్తున్నాం నా చిట్టి తల్లీ. డాడీ హృదయంలోని ప్రేమనంతా నీపై కురిపిస్తాడని హామీ ఇస్తున్నా. థాంక్యూ జెస్సీ. నువ్వో అద్భుతమైన తల్లివి అనడంలో సందేహం లేదు. మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నా' అని బ్రాత్‌వైట్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.
బ్రాత్‌వైట్ తన కుమార్తెకు ఈడెన్ పేరు కలిసొచ్చేలా పెట్టేందుకు ఓ కారణం ఉంది. 2016లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత్‌లోనే జరిగింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఆంగ్లేయులు నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్లు ఆఖరి ఓవర్లో 4 వికెట్ల తేడాతో ఛేదించారు.
చివరి ఓవర్లో విండీస్‌కు 19 పరుగులు అవసరం. అప్పుడున్న పరిస్థితుల్లో కరీబియన్లకు ఇది కష్టమే అనిపించింది. కానీ క్రీజులో నిలిచిన కార్లోస్ బ్రాత్‌వైట్ అద్భుతమే చేశాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో తొలి నాలుగు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచాడు. దాంతో స్టేడియం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అంతకు ముందు 7 మ్యాచులే ఆడిన బ్రాత్‌వైట్ హీరోగా మారిపోయాడు. విండీస్ విజయం సాధించగానే 'రిమెంబర్ ది నేమ్' అంటూ కామెంటేర్లు గట్టిగా అరిచారు. అందుకే ఇప్పుడు 'రిమెంబర్ ది నేమ్' అంటూ ఈడెన్ పేరును బ్రాత్‌వైట్ పెట్టాడు.
View this post on Instagram