By: ABP Desam | Updated at : 13 Jan 2023 11:30 PM (IST)
విరాట్ కోహ్లీ (ఫైల్ ఫొటో)
Virat Kohli On Anushka Sharma: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ పాత ఫామ్‌లోకి వచ్చాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీతో అదరగొట్టాడు. అయితే 2020 నుంచి 2022 వరకు సుమారు రెండున్నరేళ్ల సమయం భారత మాజీ కెప్టెన్‌కు అస్సలు కలిసి రాలేదు.
ఈ సమయంలో విరాట్ కోహ్లి స్వభావంలో కూడా మార్పు వచ్చింది. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ఈ క్రమంలో భార్య అనుష్క శర్మతో పాటు అభిమానులతో కూడా కొన్ని సందర్భాల్లో విరాట్ కోహ్లీ దురుసుగా ప్రవర్తించాడు.
'కుటుంబం, భార్య అనుష్క, సన్నిహితులు, స్నేహితులు తీవ్రంగా నష్టపోయారు'
విరాట్ కోహ్లీ తెలుపుతున్న దాని ప్రకారం ఆ సమయంలో అతను చాలా చిరాకుగా మారాడు. తనపై తాను కోపం తెచ్చుకున్నాడు. ఈ విషయం కుటుంబసభ్యులు, భార్య అనుష్క, సన్నిహితులు, స్నేహితులందరినీ కలచివేసింది.
నిజానికి శ్రీలంకతో మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడిన విరాట్ కోహ్లీ ఆ బ్యాడ్ టైమ్‌లో చాలా చిరాకుగా మారానని చెప్పాడు. నా చిరాకు కారణంగా భార్య అనుష్క శర్మతో సహా చాలా మంది సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఆ బ్యాడ్ టైమ్ గుర్తు చేసుకున్న విరాట్ కోహ్లీ
శ్రీలంకతో మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడిన విరాట్ కోహ్లీ కొంచెం బ్యాడ్ టైమ్ వచ్చినప్పుడు తన విషయంలో ఎక్కువ నిరాశ పడ్డామని చెప్పాడు. బాగా ఆడాలని అనుకున్నా అని భారత మాజీ కెప్టెన్ అంటున్నాడు. తన నుంచి ప్రజల ఏం కోరుకుంటున్నారో అలాగే ఆడాలనుకున్నట్లు తెలిపాడు. కానీ క్రికెట్ తనకు ఆ అవకాశం ఇవ్వలేదన్నాడు.
U-19 womens WC Final: అమ్మాయిలు సాధిస్తారా! నేడే మహిళల అండర్- 19 టీ20 ప్రపంచకప్ ఫైనల్
Shahid Afridi: మరో రికార్డు వేటలో రోహిత్ - అఫ్రిదిని దాటగలడా?
IND vs NZ 2nd T20: సమమా! సమర్పణమా! నేడు భారత్- న్యూజిలాండ్ రెండో టీ20
IND vs NZ: భారత్‌పై న్యూజిలాండ్‌కు మాత్రమే ఉన్న ఏకైక రికార్డు ఇది - ఒకటి, రెండు కాదు నాలుగు సార్లు!
IND vs NZ: ఇలా అయితే కష్టమే - అర్ష్‌దీప్ సింగ్‌పై భారత మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్!
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు
BRS Nanded Meeting: నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Delhi Khalistan Attacks : దిల్లీలో ఖలిస్థానీ స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులకు ప్లాన్- నిఘా సంస్థల హెచ్చరిక