By: ABP Desam | Updated at : 03 Mar 2022 09:31 PM (IST)
Edited By: Ramakrishna Paladi
virat-kohli-100th-test-match
Virat Kohli 100th Test: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమయ్యాడు. వంద టెస్టులు ఆడిన 12వ భారత క్రికెటర్‌గా అవతరించనున్నాడు. మొహాలి వేదికగా లంకతో జరిగే టెస్టు అతడి కెరీర్లో వందోది. అసలీ మైలురాయిని చేరుకుంటానని అస్సలు అనుకోలేదని విరాట్ అంటున్నాడు. అతడు మాట్లాడిన వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది.
'వంద టెస్టులు ఆడతానని అస్సలు అనుకోలేదు. ఇదో సుదీర్ఘ ప్రయాణం. ఆ వంద టెస్టుల మైల్‌స్టోన్ కోసం మేమెంతో క్రికెట్ ఆడాం. ఎంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడాను. వందో టెస్టు ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతా భావంతో ఉన్నాను. దేవుడు నాపై దయ చూపించాడు. నా ఫిట్‌నెస్ కోసం ఎంతో శ్రమించాను. ఇది నాకు, నా కుటుంబానికి, నా కోచ్‌కు అత్యంత గొప్ప సందర్భం. ఇందుకు వారెంతో సంతోషిస్తారు. గర్వపడతారు' అని విరాట్ అన్నాడు.
ఇప్పటి వరకు టీమ్‌ఇండియా తరఫున 11 మంది వంద టెస్టులు ఆడారు. సునిల్ గావస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, సచిన్ తెందూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ ఈ రికార్డు సృష్టించారు.
విరాట్ కోహ్లీ 2011లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రెండు ఇన్నింగ్సుల్లో వరుసగా 4, 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతడి బ్యాటు నుంచి పరుగుల వరద పారింది. 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. వందో టెస్టు ఆడుతున్న విరాట్‌కు మాజీ క్రికెటర్లు అభినందనలు తెలియజేశారు.
'ఇన్నేళ్లూ నీ ఆటను చూస్తుండటం ఆనందంగా ఉంది. గణాంకాలు వాటి పాత్రను అవి పోషిస్తాయి. కానీ మొత్తం ఒక తరాన్ని మోటివేట్ చేయడమే నీ అసలైన బలం' అని సచిన్ తెందూల్కర్ అన్నాడు. 'ఇండియన్ క్రికెట్‌కు నువ్వెంతో సేవ చేశావు. దానినే నేను అసలైన విజయం అంటాను. నువ్వు ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడాలి. రాణించాలి' అని పేర్కొన్నాడు.
'I never thought i'll play 100 Test matches. It has been a long journey. Grateful that i've been able to make it to 100' - @imVkohli on his landmark Test.
— BCCI (@BCCI) March 3, 2022
Full interview coming up on https://t.co/Z3MPyesSeZ. Stay tuned! #VK100 pic.twitter.com/SFehIolPwb
A Very Very Special message from @VVSLaxman281 to a Very Very Special cricketer! 👍 👍
— BCCI (@BCCI) March 3, 2022
Congratulations @imVkohli on your 💯th Test! 👏 👏#VK100 pic.twitter.com/ma3YcGVnE0
Former #TeamIndia Captain & Current BCCI President - @SGanguly99 - has a message for @imVkohli on his 1⃣0⃣0⃣th Test. 👍 👍#VK100 pic.twitter.com/yXDz4bW5Wd
— BCCI (@BCCI) March 3, 2022
Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు
Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్ గన్
Wrestling Federation of India: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత
Ishan Kishan: ఇషాన్ కిషన్ ఆ తప్పు చేయకుండా ఉంటే...
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు
Jagan Case: కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్
/body>